
యూట్యూబ్‌లో తెలుగు స్టార్‌ల సాంగ్స్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఒక్కో లిరికల్ వీడియో100 నుంచి 400 వరకు వ్యూస్‌ని రాబట్టి దేశ వ్యప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదే కోవలో మహేష్ నటించిన చిత్రంలో ని ఓ పాట 100 మిలియన్‌ల వ్యూస్‌ని అధిగమించి సరికొత్త రికార్డుని సాధించింది. గత ఏడాది మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం `సరిలేరు నీకెవ్వరు`.
సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలోని `మైండ్ బ్లాక్ ` సాంగ్ ప్రేక్షకుల్ని ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే పాట యూట్యూబ్‌లో 100 మిలియన్‌ల వ్యూస్‌ని అధిగమించి రికార్డుని సాధించింది. ఈ పాటలో రష్మిక అందాలు, మహేష్ ఊర మాస్ స్టెప్పులు ప్రేక్షకులతో పాటు మహేష్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుని ఈ పాటని ఓ రేంజ్‌లో నిలబెట్టాయి.
మహేష్ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తోంది.