
లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్..ఫస్ట్ టైం తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో మైక్ టైసన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో భాగంగా మైక్ టైసన్ తన పాత్ర తాలూకా డబ్బింగ్ పూర్తి చేసాడు. “నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను, ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.
మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించాడు. అతనిపై చిత్రించిన సన్నివేశాలు చిత్రంలో ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటాయని చిత్రయూనిట్ అంటుంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగనే చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు.. అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు.
పూరీ కనెక్ట్స్‌తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన కేచా స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
King of the Ring, LEGEND @MikeTyson
thanks team #Liger ? after wrapping up his dubbing !!#VaatLagaDenge ?? @TheDeverakonda @karanjohar #Purijagannadh @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects @IamVishuReddy #LigerOnAug25th2022 pic.twitter.com/QHFBvIs8LW— BA Raju's Team (@baraju_SuperHit) April 1, 2022