Homeటాప్ స్టోరీస్రానా- మిహీకాల‌ ప్రీ వెడ్డింగ్ షూట్ వైర‌ల్‌!

రానా- మిహీకాల‌ ప్రీ వెడ్డింగ్ షూట్ వైర‌ల్‌!

రానా- మిహీకాల‌ ప్రీ వెడ్డింగ్ షూట్ వైర‌ల్‌!
రానా- మిహీకాల‌ ప్రీ వెడ్డింగ్ షూట్ వైర‌ల్‌!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా పెళ్లి ఏర్పాట్లు స్పీడందుకున్నాయి. ముంబైలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌ని ర‌న్ చేస్తున్న హైద‌రాబాదీ అమ్మాయి మిహీకా బ‌జాజ్‌ని రానా త్వ‌ర‌లో వివాహం చేసుకోనున్న విష‌యం తెలిసిందే. మేలో త‌న పెళ్లి వార్త‌ని ప్ర‌క‌టించిన రానా ఆ వెంట‌నే రోకా ఫంక్ష‌న్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇరు కుటుంబాల పెళ్లికి  గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో వెడ్డింగ్‌ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఇప్ప‌టికే ఆగ‌స్టు 8న వివాహం జ‌ర‌పాల‌ని ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. పెళ్లి కోసం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌ని కూడా బుక్ చేశారంటూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. పెళ్లికి ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో రానా, మిహీకా ఫొటో షూట్‌ల‌కు రెడీ అవుతున్నారు. తాజాగా న‌వ వ‌ధువు మిహీకాపై  ఫొటో షూట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

- Advertisement -

ఈ ఫొటోల‌ని మిహీకా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. సెల‌బ్రేష‌న్స్ కొన‌సాగుతాయంటూ ఫొటోల‌కు ఓ క్యాప్ష‌న్‌ని జ‌త‌చేసింది. పెళ్లితో స‌హా జ‌రిగే ప్ర‌తీ వేడుక‌ని మిహీకా డిజైన్ చేసిన‌ట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే దేవ‌క‌న్య‌లా ముస్తా బై మిహీకా బ‌జాజ్ పోజిచ్చిన ఫొటోల‌పై నెటిజ‌న్స్‌, సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All