Homeటాప్ స్టోరీస్వెడ్డింగ్ కార్డ్స్ .. జూటీ షూస్ రెడీ!

వెడ్డింగ్ కార్డ్స్ .. జూటీ షూస్ రెడీ!

వెడ్డింగ్ కార్డ్స్ .. జూటీ షూస్ రెడీ!
వెడ్డింగ్ కార్డ్స్ .. జూటీ షూస్ రెడీ!

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా స్వైర విహారం ఏస్తున్న వేళ టాలీవుడ్‌లో గ‌త మూడు నెల‌లుగా మంగ‌ళ‌ వాయిద్యాలు మోగుతున్నాయి. యంగ్ హీరో నిఖిల్ ఇటీవ‌లే సింపుల్‌గా వివాహం చేసుకోగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కూడా రెండ‌వ పెళ్లి చేసుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. వీరి త‌ర‌హాలోనే మ‌రి కొంత మంది టాలీవుడ్ సెల‌బ్రిటీలు పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు.

వారిలో ముందుగా రానా వెడ్డింగ్ జ‌ర‌గ‌బోతోంది. ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌ని ర‌న్ చేస్తున్న హైద‌రాబాదీ అమ్మాయి మిహీకా బ‌జాజ్‌ని రానా వివాహం చేసుకోనున్న విష‌యం తెలిసిందే. తాజ్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ హోట‌ల్‌లో పెళ్లి జ‌ర‌పాల‌ని ఇరు కుటుంబాలు ఫిక్స‌య్యాయి. వేదిక ని కూడా ఫైన‌ల్ చేశారు. ఆగ‌స్టు 8న వివాహం అని అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. అయితే హైద‌రాబాద్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అనుకున్న ముహూర్తానికి రానా – మిహీకాల వివాహం వుంటుందా?  లేక పోస్ట్ పోన్ అవుతుందా? అని ప్ర‌చారం మొద‌లైంది.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో మిహీకా స్ప‌ష్ట‌త‌నిచ్చారు. పెళ్లికి సిద్ధ‌మైన వెడ్డింగ్ కార్డ్స్‌, పెళ్లి కూతురు ధ‌రించే జూటీస్ షూస్‌కి సంబంధించిన ఓ ఫొటోని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసి త‌మ వివాహం అనుకున్న ముహూర్తానికే జ‌ర‌గ‌బోతోంద‌ని ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. దీంతో రానా వివాహంపై వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ ప‌డింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All