
తన వివాహానికి ముందు రానా దగ్గుబాటి వ్యవహారాలపై లెక్కలేనన్ని పుకార్లు వచ్చాయి. అన్నింటికంటే, ఎక్కువగా మాట్లాడేది నటి త్రిషతో అతని వ్యవహారం. ఏదో ఒక సమయంలో చాలామంది రానా, త్రిష వివాహం చేసుకుంటారని భావించారు. ఈ గాసిప్‌లని పక్కన పెడితే రానా వైఫ్ మిహీకా బజాజ్ ఈ ఎఫైర్‌లపై ఎలా స్పందించింది? ఆ పుకార్ల మధ్య వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దీనిపై తాజాగా హీరో రానా స్పందించారు. `నాపై చాలా పుకార్లు వచ్చాయి. ఇది అందరికీ తెలుసు. మిహీకాకు కూడా వాటి గురించి తెలుసు. ఆమె ముంబై, హైదరాబాద్ లలో పెరిగింది. ఆమెకు ప్రతిదీ తెలుసు. ప్రస్తుత తరం ఈ సంబంధాల గురించి యువకులు ఎక్కువగా ఆలోచిస్తారని నేను అనుకోను. ఇది కొంత మందికి అతిగా అనిపించినప్పటికీ మిహీకా అలాంటి గాసిప్‌ల గురించి ఎప్పుడూ బాధపడదు పట్టించుకోదు` అన్నారు.
తన అనారోగ్యం గురించి మిహీకాకు పెద్దగా తెలియదని రానా వివరించారు. ఆమె దాని గురించి తెలుసుకునే సమయానికి తను అప్పటికే పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్నాడు. మిహీకా తన ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందని రానా చెప్పుకొచ్చాడు.