Homeటాప్ స్టోరీస్ఎంజీఆర్ తో కరుణానిధి కి ఎందుకు గొడవయ్యిందంటే

ఎంజీఆర్ తో కరుణానిధి కి ఎందుకు గొడవయ్యిందంటే

MGR Karunanidhi both are good friendsతమిళనాడు ప్రజలు తమ ఆరాధ్య దైవాలుగా ఎంజీఆర్ ని అలాగే కరుణానిధి ని పూజిస్తారు పైగా ఇద్దరు కూడా మంచి స్నేహితులు . ఒకరంటే ఒకరికి ప్రాణం , అయితే ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ విరోధులుగా , ఆగర్భ శత్రులుగా మారడానికి కారణం ఏంటో తెలుసా………. కేవలం పదవి ….. ముఖ్యమంత్రి పదవి ఇద్దరు ప్రాణ స్నేహితులను శత్రువులు గా మార్చింది. సినిమారంగంలో ఉన్నప్పుడు కరుణానిధి – ఎంజీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఎంజీఆర్ తమిళ ప్రజల ఆరాధ్య నటుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నాడు , ఇక కరుణానిధి తన కలంతో పదునైన సంభాషణలతో తమిళ ప్రజలపై చెరగని ముద్ర వేశాడు. కరుణానిధి చదువుకుంది ఎనిమిదో తరగతి మాత్రమే కానీ తన రచనలతో తమిళ సాహితీరంగంలో చిరస్థాయి ఖ్యాతి నార్జించాడు .

ఎంజీఆర్ కు కరుణానిధి కి ఇద్దరికి కూడా అన్నాదురై రాజకీయ గురువు దాంతో ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు అయితే అన్నాదురై చనిపోవడంతో 1969 లో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు తొలిసారిగా . ఆ సమయంలో ఎంజీఆర్ తన పూర్తి మద్దతు ని కరుణానిధి కి తెలిపాడు అయితే కొద్దీ కాలానికే ఎంజీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించాడు కరుణానిధి అయినప్పటికీ ఎంజీఆర్ పెద్దగా లక్ష్య పెట్టలేదు కానీ కరుణానిధి రెండో సారి 1971 లో ముఖ్యమంత్రి అయ్యాక ఎంజీఆర్ ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎంజీఆర్ – కరుణానిధి ల మధ్య విబేధాలు తీవ్ర స్థాయి కి చేరాయి అంతేకాదు ఎంజీఆర్ ని డీఎంకే పార్టీ నుండి బహిష్కరించారు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంజీఆర్ అన్నా డీఎంకే పార్టీ ని స్థాపించి కరుణానిధి పార్టీని మట్టి కరిపించి 1977 నుండి వరుసగా పదేళ్ల పాటు 1987 వరకు ( చనిపోయేంత వరకు ) ముఖ్యమంత్రి గా పదవిని అధిష్టించాడు ఎంజీఆర్. ఇద్దరూ మంచి స్నేహితులే ! అలాగే ఇద్దరూ మంచి పాలనాదక్షులే ! తమిళనాట ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న మహనీయులు . ఈ ఇద్దరి జీవితాలను వెండితెరపై ఇద్దరు అనే చిత్రంతో ఆవిష్కరించాడు దర్శకుడు మణిరత్నం. అయితే ఆ సినిమా అంతగా విజయం సాధించలేకపోయింది.

- Advertisement -

English Title: MGR Karunanidhi both are good friends

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All