నవాజుద్దీన్ సిద్దిఖి నాపై బలాత్కారం చేసాడు అని సంచలన వ్యాఖ్యలు చేసి మీటూ ఉద్యమంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చింది బాలీవుడ్ నటి , మోడల్ నిహారిక సింగ్ . అయితే నవాజిద్దీన్ మాయమాటలు చెబుతున్నప్పుడు , బలవంతం చేస్తున్నప్పుడు లొంగిపోయి ఇప్పుడు మాత్రం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది . ఒకసారేమో తన ఇంట్లో నన్ను రేప్ చేయబోయాడు కుదరలేదని , ఇంకోసారి ఏకంగా నా ఇంటికి వచ్చి తలుపులు తీయగానే మీదపడి రేప్ చేసాడని అయితే ఆ సమయంలో నేను బలహీనురాలినయ్యనని అంటోంది నిహారిక సింగ్ .
అయితే ఇదంతా గతం ! కానీ మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో నేను కూడా బాధితురాలినే అని అంటోంది . అంతేకాదు నవాజుద్దీన్ సిద్దిఖి నాకు చెప్పకుండా నా పేరుని ఎలా బయట పెడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నిహారిక . అయితే నిహరికని పెళ్ళి చేసుకోవాలని ఉందని రకరకాల మోసపూరిత మాటలు చెప్పాడట దాంతో మొదట్లో అతడ్ని నమ్మానని కానీ అతడు మోసం చేస్తున్నట్లు పసిగట్టానని అందుకే అతడిని దూరం పెట్టానని అంటోంది నిహారిక సింగ్ .
English Title: #MeToo: Niharika Singh accuses Nawazuddin Siddiqui