Homeన్యూస్`మేరా భార‌త్ మ‌హాన్‌` ఆడియో

`మేరా భార‌త్ మ‌హాన్‌` ఆడియో

Mera Bharat Mahan Movie audio launchప్రత ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రంగ‌ల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టి.ప‌ల్ల‌వి రెడ్డి సంయుక్తంగా సామాజిక ఇతివృత్తంతో నిర్మిస్తోన్న చిత్రం `మేరా భార‌త్ మ‌హాన్‌`. అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 22న హన్మకొండ ములుగు రోడ్ లోని వజ్ర గార్డెన్స్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన న‌టుడు , ఎమ్మెల్యే బాబూమోహ‌న్ ఆడియో సీడీలు లాంచ్ చేసి వ‌రంగ‌ల్ మేయ‌ర్ న‌న్న‌పునేని న‌రేందర్ కు అంద‌జేశారు.

అనంత‌రం మేయ‌ర్ న‌న్న‌పునేని న‌రేందర్ మాట్లాడుతూ…“చిత్ర నిర్మాత‌లు ముగ్గురూ నాకు ఆప్త మిత్రులు. దేశ‌భ‌క్తితో కూడిన మంచి టైటిల్ సినిమాకు పెట్టారు. బాధ్య‌త‌తో తీసిన ఈ సినిమాను ఆద‌రించాల్సిన బాధ్య‌త మనంద‌రిది . ఈ సినిమా విజ‌యవంత‌మై వంర‌గ‌ల్ కు చెందిన గొప్ప నిర్మాత‌లుగా పేరు తెచ్చుకోవాలనీ, ఇలాంటి సామాజిక చిత్రాలు మ‌రెన్నో నిర్మించాల‌నీ“ అని అన్నారు.

- Advertisement -

బాబూమోహ‌న్ మాట్లాడుతూ…“నాకిష్ట‌మైన ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ .ఇందులో నేను కూడా ఒక అద్భుత‌మైన పాత్ర చేశాను. భ‌ర‌త్ ఎంతో గొప్ప‌గా సినిమాలు తెర‌కెక్కిస్తాడు. కానీ టైమ్ బాగా లేక‌నో, మ‌రేంటో కానీ, కొన్ని మిస్ ఫైర్ అవుతున్నాయి. కానీ ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్స్ చూశాక సూప‌ర్ హిట్ కొట్ట‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. నిర్మాత‌లు కూడా అభిరుచితో సినిమా నిర్మించారు“ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాంబేష్ మాట్లాడుతూ…“ డ‌బ్బుకోస‌మో, పేరు కోస‌మో మా నిర్మాలు ఈ సినిమా చేయ‌లేదు. అది వారికి బోలెడంత ఉంది. కేవ‌లం ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుక‌రావ‌డానికి నిర్మాత‌లు ఈ సినిమా చేశారు“ అన్నారు.

పాట‌ల ర‌చ‌యిత పెద్దాడ‌మూర్తి మాట్లాడుతూ…“మంచి పాట‌లు రాయాలంటే మంచి సంద‌ర్భాలు ఉండాలి. అంత మంచి సంద‌ర్భాలు ఇచ్చిన ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ గారికీ, ఇంత మంచి సినిమాను నిర్మించ‌డానికి ముందుకొచ్చిన నిర్మాత‌ల‌కు, చ‌క్క‌టి బాణీలు ఇచ్చిన ల‌లిత్ సురేష్ గారికి నా ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ల‌లిత్ సురేష్ మాట్లాడుతూ…“పాట‌లు బాగా వ‌చ్చాయంటే అంత మంచి కంటెంట్ వ‌ల్లే. ఇందులో 8 పాట‌లు ఉన్నాయి. పెద్దాడ‌మూర్తి గారు చాలా బాగా రాశారు“ అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ మాట్లాడుతూ…“ఏ స‌మ‌స్యైనా మ‌న చేతుల్లోనే ఉంది. ఫ‌స్ట్ వినేలా చెప్పాలి..విన‌కుంటే చెంప చెళ్లుమ‌నిపించైనా చెప్పాలి అనేది మా చిత్ర క‌థాంశం. విద్య‌, వైద్యం సామాన్యుడుకు అంద‌డం లేదు. డ‌బ్బున్న వాళ్లకే స‌రైన విద్య‌, వైద్యం ద‌క్కుతున్నాయి. మ‌రి లేని వారి ప‌రిస్థితి ఏంటి? దీనికి కార‌ణం ఏంటి? సిస్ట‌మ్ లో ఉన్న కొన్ని ప్రాబ్ల‌మ్స్. కాబ‌ట్టి వాటిని స‌వ‌రించండి అని చెప్పే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప ఎవ‌రికీ వ్య‌తిరేఖంగా సినిమా ఉండ‌దు. ల‌లిత సురేష్ గారు బాణీల‌కు, పెద్దాడ‌మూర్తి గారు ఆలోచింప‌జేసే సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు“ అన్నారు
న‌టుడు వేణుమాధ‌వ్ మాట్లాడుతూ…“సినిమా చూశాను భ‌ర‌త్ గారు చాలా ఎమోష‌నల్ గా తీసారు. ఈ సినిమాలో నేను ఎందుకు న‌టించాలేదా అనిపించింది. ఈ సినిమాకు నేను అన్ని విధాలుగా సపోర్ట్ నివ్వ‌డానికి రెడీగా ఉన్నాన్నారు.

హీరో అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ….“భ‌ర‌త్ గారితో వ‌ర్క్ చేశాక తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న మ‌రో శంక‌ర్ గారిలా అనిపించారు. ఈ సినిమా చేయ‌డం గొప్ప అనుభూతి“ అన్నారు.
నిర్మాత డా.తాళ్ల ర‌వి మాట్లాడుతూ…“ముగ్గురం డాక్ట‌ర్లం క‌లిసి ఈ సినిమాను నిర్మించాం. ప‌బ్లిక్ కు ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ ఇస్తున్నాం. శ్రీధ‌ర్ రాజ్ గారి క‌థ‌ను భ‌ర‌త్ గారు అద్భుతంగా డీల్ చేశార‌న్నారు.
క‌థా ర‌చ‌యిత‌, న‌టుడు, డా.శ్రీధ‌ర్ రాజ్ మాట్లాడుతూ…“మా వ‌రంగ‌ల్ లో ఆడియో చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వ‌రంగ‌ల్ పోరుగ‌డ్డ‌. ఏ ఉద్య‌మం అయినా ఇక్క‌డే మొద‌ల‌వుతుంది. స‌గ‌టు మ‌నిషి ప‌డుతున్న బాధ‌లు మా సినిమాలో చూపించాం. ప్ర‌భుత్య పాల‌సీల గురించి చ‌ర్చించాం. సామాజిక అంశానికి క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి భ‌ర‌త్ గారు అద్భుతంగా తీసారు. నేను కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను“ అన్నారు.

మ‌రో నిర్మాత ప‌ల్ల‌వి రెడ్డి మాట్లాడుతూ…“యంగ్ స్ట‌ర్స్ కోసం చేసిన సినిమా. వారే వారి భుజాల‌పై వేసుకోని హిట్ చేయాలి. ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.
బాబు మోహన్ , త‌ణికెళ్ల భ‌ర‌ణి, గిరి బాబు, ఆమని , నారాయణ రావు, ఎల్ బి శ్రీరాం, బాలాజీ, సుద‌ర్శ‌న్, సుమ‌న్‌శెట్టి, అపూర్వ‌, దాస‌న్న త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి స్టోరిః డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర‌, డైలాగ్స్ః య‌ర్రంశెట్టి సాయి, పాట‌లుః పెద్దాడ‌మూర్తి, ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను, ఫైట్స్ః విజ‌య్‌, మేక‌ప్ః యాద‌గిరి, పి.డేవిడ్, సినిమాటోగ్ర‌ఫీః ముజీర్ మాలిక్‌, సంగీతంః ల‌లిత్ సురేష్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః సోమ‌ర్తి సాంబేష్‌, ప్రొడ్యూస‌ర్స్ః డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, తోక‌ల ప‌ల్ల‌వి రెడ్డి. స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః భ‌ర‌త్.​

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All