Homeటాప్ స్టోరీస్`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌

`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌

mela movie teaser launchమామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మేళా’. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో అతిథులుగామ పాల్గొన్న నటుడు అలీ, ఎస్. గోపాల్ రెడ్డి లు విడుదల చేశారు. ఈ సందర్భంగా …

అలీ మాట్లాడుతూ “ డైరెక్టర్ కిరణ్ మొదట ఇండస్ట్రీకి యాక్టర్ అవ్వాలని వచ్చారు. కుదరక రైటర్ అయ్యారు ఆతరువాత నిర్మాత ..ఇప్పుడు ఈ మేళా చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.. అలాగే సూర్య తేజ `వినాయకుడు` చిత్రంతో పరిచయం అయినా… ఈ చిత్రంతో మంచి రేంజ్ కు వెళ్లనున్నాడు.. టైటిల్ కు తగ్గట్టు సినిమా ఉంటుంది… ఇప్పుడు టీజర్ లో చూసింది 10వ వంతు మాత్రమే… సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది.. సినిమాను, యూనిట్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నా“ అన్నారు.

- Advertisement -

సెలెబ్ కనెక్ట్ రాజ్ మాట్లాడుతూ “ఇండస్ట్రీ గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు.. మొదటి సారి హీరో సూర్య ద్వారా అడుగుపెట్టాం. బాగుంది. మా `మేళా` టీం అందరి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా“ అన్నారు..

దర్శకుడు కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ “ మంచి కథను సపోర్ట్ చేసిన నిర్మాతలందరికీ నా కృతఙ్ఞతలు.. మొదటి నుంచి నన్ను మోసుకు తిరుగుతున్న సూర్యకు థాంక్స్.. మనం మాట్లాడటం కంటే పనే మాట్లాడాలనే దానికి ఈ సినిమానే నిదర్శనం. మూడు వెరీయేషన్స్ లో సినిమా ఉండనుంది. సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా ధ‌న్సిక‌గారి న‌ట‌న సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సెలెబ్ వారు ఇచ్చిన ఎనర్జీ తో ముందుకెళుతున్నాం… అందుకు వారికి ధన్యవాదాలు“అన్నారు.

హీరో సూర్య తేజ మాట్లాడుతూ “సీనియర్ యాక్టర్స్ అంద‌రూ సినిమాలో న‌టించారు. సినిమాలో నా పాత్ర మూడు వెరీయేషన్స్ లో ఉంటుంది. అలాగే సినిమాలో చాలా వెరైటీ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి… సినిమా ఒక మర్డర్ మిస్టరీ అని చెప్పొచ్చు… డిఫరెంట్ జోనర్ టచ్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా, అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ గారిపై కొంత మంది చేస్తున్న అసభ్య, అనుచిత వ్యాఖ్యలను, నేను పూర్తిగా ఖండిస్తున్నా… సంతాపం తెలియచేసున్నా… ఒక యువకుడిగా నేను పవన్ గారికి నా పూర్తి మద్దతను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను“ అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ “ఇది నా డెబ్యూ మూవీ.. టీమ్ సందరూ చాలా సపోర్ట్ చేశారు.. … స్ట్రాంగ్ స్టోరీ కనుక ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యి తీరుతుంది“ అన్నారు..

ఈ కార్యక్రమానికి సెలెబ్ కనెక్ట్ అధినేతలు స్టీఫెన్, సుమన్, పిఎస్‌.పి అధినేత ప్రకాష్ లతో పాటు హీరోయిన్ సోనీ, దాసరి కిరణ్, విస్సు, మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు, రామ్ సుంకర, చంద్ర కిరణ్, పెద్ది రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సెల‌బ్ క‌నెక్ట్ సంస్థ ప్ర‌మోష‌న‌ల్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హిస్తున్నారు.

సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా, అలీ, రాజా రవీంద్ర, భరత్‌ రెడ్డి, నాగినీడు, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: పెద్దిరాజు విహాస్‌, సంగీతం: సుక్కు, డ్యాన్స్‌: చంద్ర కిరణ్‌, కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటర్‌: చంద్రమౌళి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి, నిర్మాత: సంతోష్‌ కుమార్‌ కొంకా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్‌ శ్రీపురం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All