Homeటాప్ స్టోరీస్బాలయ్య సినిమా రూమర్స్ పై స్పందించిన మెహ్రీన్

బాలయ్య సినిమా రూమర్స్ పై స్పందించిన మెహ్రీన్

బాలయ్య సినిమా రూమర్స్ పై స్పందించిన మెహ్రీన్
బాలయ్య సినిమా రూమర్స్ పై స్పందించిన మెహ్రీన్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరకు చేరుకుంది. మరో రెండు షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత బాలయ్య తన 107వ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం మొదలైంది. ఇది ఎక్కువ అవ్వడంతో మెహ్రీన్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

“నేను ప్రస్తుతం మారుతి – సంతోష్ సినిమాలో నటిస్తున్నాను. అది కాకుండా నేను మరో చిత్రంలో చేస్తున్నాను అనే దాంట్లో  ఎలాంటి నిజం లేదు. అవి కేవలం రూమర్స్ మాత్రమే. వాటిని నమ్మకండి. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను” అని మెహ్రీన్ పోస్ట్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All