Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్మార్చి 12న మెహ‌రీన్ ఎంగేజ్‌మెంట్‌!

మార్చి 12న మెహ‌రీన్ ఎంగేజ్‌మెంట్‌!

మార్చి 12న మెహ‌రీన్ ఎంగేజ్‌మెంట్‌!
మార్చి 12న మెహ‌రీన్ ఎంగేజ్‌మెంట్‌!

టాలీవుడ్‌లో వ‌రుస పెళ్లిళ్లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ స‌డ‌లింపుల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో అనూహ్యంగా పెళ్లిళ్లు మొద‌ల‌య్యాయి. ఆ వ‌రుస ఇప్ప‌టికీ కంట‌న్యూ అవుతూనే వుంది. ఇటీవ‌ల యువ హీరో, ఎం.ఎస్‌. రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో హీరోయిన్ పెళ్లికి పచ్చ జెండా ఊపేసింది.

- Advertisement -

హ‌నీ ఈజ్ ద బెస్ట్ అంటూ `ఎఫ్‌2`లో త‌న‌దైన మార్కు హాస్యంతో ఆక‌ట్టుకున్న మెహ‌రీన్ త‌న గ్లామ‌ర్‌తో ఎంతో తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌నే సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం `ఎఫ్‌2`కు సీక్వెల్‌గా రూపొందుతున్న `ఎఫ్‌3`లో న‌టిస్తున్న మెహ‌రీన్ పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. కాంగ్రెస్‌కి భ‌వ్య బిష్ణోయ్‌ని మెహ‌రీన్ వివాహం చేసుకోబోతోంది. వీరికి ఎంగేజ్‌మెంట్ మార్చి 12న జ‌ర‌గ‌బోతోంది.

ఇరు కుటుంబాల వారు ఈ పెళ్లికి అంగీక‌రం తెల‌ప‌డంతో ఎంగేజ్‌మెంట్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయ‌ట‌. భ‌వ్య బిష్టోయ్ హ‌ర్యానాకు చెందిన యువ రాజ‌కీయ నాయ‌కుడు. అత‌ని తండ్రి సీనియ‌ర్ ఎంపీ, కాంగ్రెస్ నాయ‌కుడు. ఈ సంబంధాన్ని మెహ‌రీన్ త‌ల్లి ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. పెళ్లి డేట్‌ని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. మంచి ముహూర్తం చూసుకుని ఎంగేజ్‌మెంట్ రోజే పెళ్లి డేట్‌ని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts