Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్మెహబూబా రివ్యూ

మెహబూబా రివ్యూ

Mehbooba Review
మెహబూబా రివ్యూ

మెహబూబా రివ్యూ
నటీనటులు : ఆకాష్ పూరి , నేహా శెట్టి
సంగీతం : సందీప్ చౌతా
నిర్మాణం : పూరి కనెక్ట్స్
దర్శకత్వం : పూరి జగన్నాధ్
రేటింగ్ : 2.5/ 5
విడుదల తేదీ : 11 మే 2018

- Advertisement -

గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న పూరి జగన్నాధ్ ఈసారి తన తనయుడు పూరి ఆకాష్ ని హీరోగా నిలబెట్టడానికి అలాగే తనకు కూడా మళ్ళీ హిట్ ఇచ్చుకోవడానికి సాహసమే చేసాడు దర్శకులు పూరి జగన్నాధ్ . ఇండో – పాక్ ఇతివృత్తాన్ని ఎంచుకొని తీసిన ”మెహబూబా ” చిత్రంతో పూరి హిట్ కొట్టాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే .

కథ :

ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామంటే అది ఇష్టం లేని అఫ్రీన్ ( నేహ శెట్టి ) చదువు కోసం పాకిస్తాన్ నుండి ఇండియాకు వస్తుంది , హైదరాబాద్ లో రోషన్ (ఆకాష్ ) అఫ్రీన్ ని ఓ ప్రమాదంలో కాపాడతాడు అయితే అతడ్ని చూడదు అఫ్రీన్ దాంతో తనని కాపాడిన వ్యక్తిని కలవాలని ఆశపడుతుంది . గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అటు అఫ్రీన్ ని ఇటు రోషన్ ని వెంటాడుతుంటాయి అయితే స్పష్టంగా తెలియక పోవడంతో కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటాడు రోషన్ . ట్రెక్కింగ్ కోసం హిమాలయాలకు రోషన్ వెళుతున్న సమయంలోనే ఇండియా నుండి పాకిస్తాన్ కు వెళ్ళడానికి రోషన్ ఎక్కినా ట్రైన్ లోనే ఎక్కుతుంది అఫ్రీన్ . ఆ సమయంలో తనని కాపాడింది రోషన్ అని తెలుసుకుంటుంది . హిమాలయాలకు వెళ్ళిన రోషన్ కి గత జన్మ తాలూకు రహస్యం తెలుస్తుంది . అసలు రోషన్ – అఫ్రీన్ ల గతం ఏంటి ? ఒక జన్మలో కలవని వాళ్ళు మరు జన్మలో కలిసారా ? వాళ్ళని విడదీయాలని చూస్తున్నవాళ్ళు ఎవరు ? అన్నది తెలియాలంటే
సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఆకాష్ పూరి
సెకండాఫ్
ఛాయాగ్రహణం

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే
పాటలు

నటీనటుల ప్రతిభ :

ఆకాష్ పూరి కి ఒకే చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలను పోషించే చాన్స్ రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు . పోరాట సన్నివేశాల్లో బాగా మెప్పించాడు ఆకాష్ . హీరోయిన్ నేహ శెట్టి కి కూడా మంచి పాత్రే లభించింది , నేహా కూడా మంచి అభినయాన్ని ప్రదర్శించింది . మురళీశర్మ , షియాజీ షిండే , విష్ణు రెడ్డి తదితరులంతా తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

విజువల్స్ బాగున్నాయి , ఈ చిత్రంలో హైలెట్ ఛాయాగ్రహణం అనే చెప్పాలి . సందీప్ చౌతా అందించిన పాటల్లో కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు పూరి జగన్నాధ్ విషయానికి వస్తే పూరి మార్క్ డైలాగ్స్ లేకపోయినప్పటికీ పూర్తిస్థాయిలో కాకపోయినా ఫరవాలేదనే స్థాయిలో ఆకట్టుకున్నాడు . కాస్త స్లో నేరేషన్ తో ప్రేక్షకులు మొదటి భాగంలో ఇబ్బంది పడతారు కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి పూరి మార్క్ చూపించాడు . గతకొంత కాలంగా వరుస్ పరాజయాలు అందుకుంటున్న పూరి కి ఇది ఒయాసిస్ లాంటి విజయమే !

ఓవరాల్ గా :
యూత్ ని ఆకట్టుకునే మెహబూబా

Click here for English Review

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts