Homeటాప్ స్టోరీస్మ‌న‌వ‌రాలితో మెగాస్టార్ సంద‌డి!

మ‌న‌వ‌రాలితో మెగాస్టార్ సంద‌డి!

మ‌న‌వ‌రాలితో మెగాస్టార్ సంద‌డి!
మ‌న‌వ‌రాలితో మెగాస్టార్ సంద‌డి!

వెండితెర‌పై పాటొచ్చిందంటే.. ఆ పాట‌కు చిరు స్టెప్పేసారంటే ఫ్యాన్స్‌కి పూన‌కాలే. అలాంటి పూఊన‌క‌మే తాత‌య్య పాట‌ని చూసే స‌రికి ఆయ‌న మ‌న‌వ‌రాలికి కూడా వ‌చ్చిందేమో.. అందుకే ఏడాది కూడా నిండ‌ని మ‌న‌వ‌రాలు నివిష్క స్టెప్పులేయ‌డం నెటిజ‌న్స్‌ని, చిరు ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోని మెగాస్టార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

చిరంజ‌వి న‌టించిన `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రంలోని పాట‌ని చూస్తూ మ‌న‌వ‌రాలితో కాల‌క్షేపం చేశారు. సోమ‌వారం దీనిపై ఆస‌క్తిక‌ర ట్వీట్ చూస్తూ `సాధార‌ణంగా సాంగ్స్ షూట్ చేస్తున్న స‌మ‌యంలో వాటిని ఆసాంతం వినేందుకు ఇష్ట‌ప‌డ‌తా. మ‌ధ్య‌లో బ్రేకుల వ‌స్తే నాకు ఇష్టం వుండ‌దు. కానీ ఇటీవ‌ల ఓ పాట‌ను మ‌ధ్య‌లో ఆపి ఆపి విన‌డం భ‌లే స‌ర‌దా అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో మంగ‌ళ‌వారం చెబుతా` అని ట్వీట్ చేశారు.

- Advertisement -

మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు త‌న మ‌న‌వ‌రాలితో వున్న ఓ వీడియోని షేర్ చేశారు. సంగీతానికి వుండే శ‌క్తిని చూస్తే నిజంగా అద్భుతం. ఏడాది వ‌య‌సున్న చిన్నారిని చూడండి మ్యూజిక్‌ని ఎలా ఎంజాయ్ చేస్తోందో. అంతే కాదు పాట‌కు అనుగుణంగా డ్యాన్స్ చేయ‌డం స‌ర‌దాగా వుంది. పాజ్ అండ్ మ్యూజిక్ చూడ‌టం ఇప్పుడు భ‌లే స‌ర‌దాగా వుంది. పాట నాది కాబ‌ట్టి అమ్మమ్మ సురేఖ క్రెడిట్ కూడా నాదే` అని ట్వీట్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All