Monday, September 26, 2022
Homeటాప్ స్టోరీస్విలేజ్ సెట్ కోసం 20 కోట్లు ఖ‌ర్చు పెట్టారా?

విలేజ్ సెట్ కోసం 20 కోట్లు ఖ‌ర్చు పెట్టారా?

విలేజ్ సెట్ కోసం 20 కోట్లు ఖ‌ర్చు పెట్టారా?
విలేజ్ సెట్ కోసం 20 కోట్లు ఖ‌ర్చు పెట్టారా?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట‌వుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. కొర‌న‌టాల శివ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ కోసం ఇప్ప‌టికే 4 కోట్ల వ్య‌యంతో టెంపుల్ సెట్‌ని నిర్మించారు. మ‌రో కీల‌క షెడ్యూల్ కోసం కేర‌ళ విలేజ్ సెట్‌ని భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిసింది. టెంపుల్ సెట్‌, కేర‌ళ విలేజ్ సెట్ అంతా క‌లిపి దాదాపు 20 కోట్ల ఖ‌ర్చు అయిన‌ట్టు చెబుతున్నారు.

కోకాపేట‌లోని 16 ఎక‌రాల్లో కేర‌ళ విలేజ్ సెట్‌ని నిర్మించార‌ట‌. సంక్రాంతి త‌రువాత కీల‌క షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సెట్ వ‌ర్క్‌ని ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ట‌. ఈ మూవీలో హీరో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts