
మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై పంచ్ వేశారంటే అది ఓ రేంజ్‌లో పేలుతుంది. అయితే పొలిటికల్ పంచ్‌లు ఆ అంతగా పుళలేదు. కానీ ఆయన తాజాగా కేంద్రంపై వేసిన పొలిటికల్ పంచ్ వీరలెవెల్లో పేలిపోయింది. పదేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తరువాత సినిమాలని తప్ప రాజకీయ అంశాలకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు.
గత కొంత కాలంగా రాజకీయాలంటే అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కానీ తాజాగా ఆయన విసిరిన పొలిటికల్ పంచ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా సైలెంట్‌గా వుంటున్న మెగాస్టార్ ఏకంగా కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి అండగా నిలిచి తన మద్దతుని బాహాటంగానే తెలియజేశారు. గురువారం మరో అడుగు ముందుకేసి ఏకంగా కేంద్రంపై పవర్‌ఫుల్ పంచ్ వేయడం చర్చనీయాంశంగా మారింది.
విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయొద్దంటూ ముందు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన చిరు గురువారం సాయంత్రం అదే ఉక్కు కర్మాగారం విషయాన్ని ఎత్తిచూపుతూ పవర్‌ఫుల్ పంచ్ వేశారు. #VizagSteelPlant #OxygenForIndia అనే హ్యాష్ ట్యాగ్‌లని జోడించి `దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్‌లు అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఒక స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ని మహారాష్ట్ర తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి 100 టన్నుల ఆక్సిజన్‌ని ఉత్పిత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో వుందని ప్రైవేట్ పరం చేయటం ఎంత వరకు సమంజసం??? మీరే ఆలోచించండి` అంటూ చిరు వేసిన పంచ్ వైరల్‌గా మారింది.
Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021