Homeటాప్ స్టోరీస్ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై చిరు కామెంట్‌!

ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై చిరు కామెంట్‌!

ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై చిరు కామెంట్‌!
ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై చిరు కామెంట్‌!

త‌మిళ సూపర్‌స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ పుట్టిన రోజు నేడు. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా త‌న‌దైప స్టైల్స్ మేన‌రిజ‌మ్స్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై స్టైల్స్‌కి కెరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ర‌జ‌నీ ఈ శ‌నివారంతో ఏడు ప‌దుల వ‌య‌సులోకి అడుగుపెడుతున్నారు. ఇదే నెలారున త‌న రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న‌ని కూడా చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా త‌లైవాపై శుభాభినంద‌న‌ల వ‌ర్ం కురుస్తోంది. త‌న ప్రియ‌నేస్తం ర‌జ‌నీకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

`నా ప్రాణ స్నేహితుడు ర‌జ‌నీకాంత్‌కు 70వ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. అద్భుత‌మైప జీవితం మీ సొంతం కావాల‌ని ఆశిస్తున్నా. రాజ‌కీయాల్లో కూడా విజ‌యం సాధించాలని కోరుకుంటున్నా. నీ ప్ర‌త్యేక‌మైన స్టైల్ తో సినిమా ద్వారా కోట్లాది మంది హృద‌యాల్ని గెలుచుకున్నావు. ఇప్పుడు వాళ్లంద‌రికీ సేవ చేసేందుకు ప్ర‌త్యేక‌మైన దారిని అనుస‌రిస్తావ‌ని న‌మ్ముతున్నా` అని చిరు ట్వీట్ చేశారు. ఇదే త‌ర‌హాలో తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల‌కి చెందిన ప‌లువురు ర‌జ‌నీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

- Advertisement -

హ్యీపీబ‌ర్త్‌డే ర‌జ‌నీకాంత్ స‌ర్‌. ల‌క్ష‌లాది మందికి స్ఫూర్తినిస్టూ.. సినిమా స్టైల్‌ని ఇలాగే కొన‌సాగించాల‌ని ఆశిస్తున్నా. ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యం సంతోషంగా వుండాలని కోరుకుంటున్నా` అని మ‌హేష్ ట్వీట్ చేశారు. ల‌క్ష‌లాది మంది ఆరాధించే సూప‌ర్‌స్టార్‌. మా త‌లైవా ర‌జ‌నీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని కోరుకుంటున్నా` అని ర‌వితేజ పేర్కొన్నారు. ఇదే త‌ర‌హాలో విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌. మురుగ‌దాస్ ట్వీట్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All