Homeటాప్ స్టోరీస్మెగా స్టార్ గాడ్ ఫాదర్ రంగంలోకి దిగేసాడు

మెగా స్టార్ గాడ్ ఫాదర్ రంగంలోకి దిగేసాడు

మెగా స్టార్ గాడ్ ఫాదర్ రంగంలోకి దిగేసాడు
మెగా స్టార్ గాడ్ ఫాదర్ రంగంలోకి దిగేసాడు

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని రీసెంట్ గా పూర్తి చేసాడు. ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేశాడు. ఎప్పటినుండో మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడిగా ఎంపికయ్యాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ ను మొదలుపెట్టింది.

ఈరోజు ఉదయం యాక్షన్ సన్నివేశం చిత్రీకరణతో షూటింగ్ ను మొదలుపెట్టారు. మోహన్ రాజా ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాడు. స్టన్ సిల్వా ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. టాప్ సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ సినిమా కోసం సురేష్ సెల్వరాఘవన్ స్పెషల్ సెట్స్ ను క్రియేట్ చేసాడు. మొదటి షెడ్యూల్ అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో మొదలైంది.

- Advertisement -

ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే మొదటి పాటను రికార్డ్ చేయడం పూర్తయిందని తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All