Homeటాప్ స్టోరీస్జనతా కర్ఫ్యూ కు మెగాస్టార్ సపోర్ట్

జనతా కర్ఫ్యూ కు మెగాస్టార్ సపోర్ట్

జనతా కర్ఫ్యూ కు మెగాస్టార్ సపోర్ట్
జనతా కర్ఫ్యూ కు మెగాస్టార్ సపోర్ట్

దేశ ప్రజలందరూ రేపు ఆదివారం అనగా.. మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలనీ, విస్తరిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతుగా సహకరించాలన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి బలపరిచారు.ఈ మేరకు సామాజిక మాధ్యమాలలో మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను విడుదల చేశారు.

ఇందులో భాగంగా దేశ ప్రధాని కోరిక మేరకు రేపు అనగా ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ స్వచ్చంద కర్ఫ్యూ పాటించాలని విస్తరిస్తున్న కరోనా వైరస్ కు వ్యాప్తిని అరికట్టడానికి ఇది మొట్ట మొదటి అడుగు అవుతుందని… ప్రజలు అందరూ సహకరించాలని చిరంజీవి కోరారు.

- Advertisement -

అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రజలు తమ ఇంటి గుమ్మం వద్ద నుండే ప్రతిరోజూ కరోనా వైరస్ పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న డాక్టర్లు,నర్సులు,శాస్త్రవేత్తలు,ఆరోగ్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, జర్నలిస్టులు ఇతర సామాజిక స్వచ్ఛంద కార్యకర్తలు కృతజ్ఞతా పూర్వకంగా కరతాళధ్వనులు చేయాలని లేదా ఏదో ఒక శబ్దం చేసి సామాజిక సంఘీభావం ప్రకటించాలని కూడా చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All