
మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ చూడని గుండు గెటప్‌లో కనిపించి అందరికి సడెన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. చిరు నున్నని గుండు లుక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు మెగా ఫ్యాన్స్‌లోనూ సంచలనంగా మారింది. ఉన్నట్టుండి బాస్ ఎందుకు గుండు చేయించుకున్నట్టు. ఏమా కథ? అని ఆరా తీశారు. అయితే ఈ గుండు వెనక పెద్ద స్టోరీ వుందని తాజాగా తెలిసింది.
మెగాస్టార్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం `ఆచార్య`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే తాజా షెడ్యూల్‌లో కీలక అతిథి పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ నటించనున్నారట. ఇదిలా వుంటే ఆ సమయంలో చిరు మరో సినిమాకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
చిరంజీవి తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన `వేదాలం`ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఫొటో షూట్ కోసం చిరు గుండు లుక్‌తో కనిపించారని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌తో ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించబోతున్నారని తెలిసింది.