
మెగాస్టార్ గుండ్ లుక్ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చిరు గుండుతో కనిపించిన సీన్ కానీ, సినిమా కానీ లేదు. అయితే తాజాగా ఆయన గుండు లుక్ తో వున్న ఫొటో ఒకటి బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోని స్వయంగా సోషల్ మీడియాలో ఇన్‌స్టా గ్రామ్‌లో మెగాస్టార్ చిరంజీవి షేర్ చేయడం మరింత ప్రాథాన్యతను సంతరించుకుంది.
బ్లాక్ గాగుల్స్ ధరించి గుండు లుక్‌లో వున్న ఫొటోని షేర్ చేసిన చిరు ఆ ఫొటోకు `అర్బన్ మాంక్`( అర్బన్ సన్యాసి) అనే చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చారు. మాంక్‌ల బాగున్నానా? అని తన లుక్ గురించి కూడా ఓ మాట అడిగారు. ఇంతకీ వున్నట్టుండి చిరు గుండు లుక్‌తో ఎందుకిలా షాకిచ్చారు? .. లాక్‌డౌన్ టైమ్‌లో గడ్డం, మీసం తీసేసి కనిపించిన చిరు ఉన్నట్టుండి నున్నని గుండు, క్లీన్ షేవ్.. మీసం తీసేసి ఎందుకు షాకిస్తున్నట్టని అంతా ఆరాతీస్తున్నారు.
చిరు కావాలనే గుండు చేయించుకున్నారా? లేక నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నిర్వహించిన ఫొటోషూట్ కోసం చిరు ఇలా నున్నని గుండుతో కనిపిస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త టుక్ వి.వి.వినాయక్ తో సినిమా కోసమా ? లేక `ఆచార్య` అన్నది మాత్రం తెలియాల్సి వుంది.