
సీనియర్ హీరోలు.. స్టార్ హీరోలు ఏడాదికి ఒకే ఒక్క మూవీతో అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేయడం పాత పద్దతి.. ఇప్పుడు టైమ్ మారింది.. ఒకే హీరో ఏడాదికి వరుస చిత్రాలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రేసులో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో నిలుస్తున్నారు. ఒక మూవీ సెట్స్ పై వుండగానే మరో మూడు చిత్రాల్ని అనౌన్స్ చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరన్ తో కలిసి నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఏడు నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే చిరంజీవి మరో మూడు చిత్రాల్ని లైన్‌లోకి తీసుకొస్తున్నారు.
`ఆచార్య` అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే మరో మూడు చిత్రాల్ని చేయబోతున్నారు. తమిళ హిట్ చిత్రం `వేదాలం` రీమేక్‌తో పాటు మలయమాళ హిట్ మూవీ `లూసీఫర్` రీమేక్‌లో నటించబోతున్నారు. `వేదాలం` రీమేక్‌ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్నారు. `లూసీఫర్` రీమేక్‌ని వీవీ వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు త్రివిక్రమ్ లేదా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయబోతున్నారట. ఈ ఇద్దరితో సినిమాలు చేయాలని చిరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.