
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం బాగానే కష్టపడుతోంది . స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ అయిన సుస్మిత చిరంజీవి నటించిన పలు చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసింది . కాగా తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రానికి కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ని అందిస్తోంది . ఈ చిత్రంలో తమన్నా కు సుస్మిత డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వాడారట ! పైగా తమన్నా ఈ కాస్ట్యూమ్స్ పట్ల చాలా సంతోషంగా ఉంది . ఎందుకంటే తన కెరీర్ లోనే ఖరీదైన కాస్ట్యూమ్స్ ని వాడానని సంతోషం వ్యక్తం చేస్తోంది .
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ , జగపతి బాబు , విజయ్ సేతుపతి , తమన్నా , సుదీప్ , నిహారిక నటిస్తున్నారు . ఇక ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .