
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా పవన్ సినిమా కోసం ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ `వకీల్ సాబ్` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి షో పడేందుకు ముందే ఈ మూవీ హంగామా థియేటర్ల వద్ద హంగామా మొదలుపెట్టారు.
ఇదిలా వుంటే ఈ మూవీని ప్రత్యేకంగా చూసిన మెగాబ్రదర్స్ ఈ మూవీపై రివ్యూ ఇచ్చేశారు. `వకీల్ సాబ్`, పవన్‌కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్టర్ వేదికగా ఈ మూవీపై మినీ రివ్యూ ఇచ్చేశారు. పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. `మూడేళ్ల తరువాత మళ్లీ పవన్‌కల్యాణ్ అదే వేడి, వాడి, పవర్‌తో వచ్చాడు. ప్రకాష్‌రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. సంగీతంతో తమన్, కెమెరా పనితనంతో వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోనీకపూర్, శ్రీరామ్ వేణుతో పాటు మిగతా టీమ్‌కి నా శుభాకాంక్షలు. అన్నింటీనీ మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన చిత్రమిది. ఈ `వకీల్ సాబ్` కేసుల్నే కాదు అందరి మనసుల్ని గెలుస్తాడు` అన్నారు.
`నేను ప్రతి చోట వింటున్న ఏకైక పదం.. పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్.. పవన్‌కల్యాణ్‌గారి నుంచి మరో ల్యాండ్ మార్క్ ఫిల్మ్. డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాతలు రాజు, శిరీష్‌లకు అభినందనలు. అలాగే మొత్తం తారాగణం,సిబ్బంది ఈ విజయానికి అర్హులు` అని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. `మూడేళ్ల ఆకలికి `వకీల్ సాబ్`తో జీవితకాలానికి సరిపడా విందు అందించాడు. ఈ సినిమా రివ్య్వూ రాయమని చాలా మంది నన్ను అడిగారు. కానీ నేను నో అని చెప్పాను. ప్రస్తుతం ఎదురవుతున్న ఓ క్లిష్టమైన సమస్యతో వచ్చిన ఈ సినిమా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది` అన్నారు నాగబాబు.
Terrific Act by @PawanKalyan
Riveting court room drama with @prakashraaj @i_nivethathomas @yoursanjali #Ananya @MusicThaman #DOPVinod did a Fab job! Congrats to #DilRaju @BoneyKapoor ji Dir #VenuSriram & Team.Most of all Hugely Relevant film on respecting women.#VakeelSaab WINS! pic.twitter.com/lTT0cYoyy7— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2021
A longing of 3 years fulfilled with the feast of a life time
People asked of to write a review and i said NO..
A movie which pushed the boundaries to pull everyones attention to address A CRITICAL issue which many of us pretend never exist.
Its ok to be You
And a No means No.. pic.twitter.com/eVfyD4p7BX— Naga Babu Konidela (@NagaBabuOffl) April 10, 2021
ONLY word I hear everywhere… Power-Packed Blockbuster ????????!
Yet another landmark film for @PawanKalyan Garu!
Congrats Director #SriramVenu Garu, Producers Raju Garu and Sirish Garu and the entire cast and crew!
Much deserved.— Ram Charan (@AlwaysRamCharan) April 10, 2021