Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ మీట్ అండ్ గ్రీట్ యువర్ ఫార్మర్ ఛాలెంజ్

టాలీవుడ్ మీట్ అండ్ గ్రీట్ యువర్ ఫార్మర్ ఛాలెంజ్

meet and greet farmer challengeఏ వ్యక్తి ఐనా తన వృత్తిలో నష్టం వస్తే ఆ వృత్తిని వదిలేసి మరలా ఆ దిశగా ఆలోచించడు కానీ మనదేశంలో ఓ ఏడాది రైతు నష్టం వాటిల్లినా మరుసటి ఏడు మానవాళికి ఆహారం అందించే తన బాధ్యత విస్మరించక మరలా నష్టం వస్తుందనే భయమున్నా ఆహారం పండించే తన కర్తవ్యాన్ని మటుకు వేడటంలేదు. ఈ క్రమంలో అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్యలకి సైతం పాల్పడిన సంఘటనలు కోకొల్లలు.

అటువంటి రైతుకి మనం ఎంతో రుణపడి వున్నామనీ వారి కృషి ఎనలేనిదనీ వారికి ధన్యవాదములు తెలిపే కార్యక్రమం మీట్ అండ్ గ్రీట్ యువర్ ఫార్మర్.

- Advertisement -

రైతులు పని చేస్తున్న పొలంలో వారిని సందర్శించి మిఠాయిలు పంచి వారితో కొంత సమయం పొలం పనులలో శ్రమని పంచుకుని రానున్న సీజనులో పంటలు బాగా పండాలని శుభాకాంక్షలు తెలిపి ఆ వృత్తాంతం వీడియో తేసి ఫేస్బుక్కులలో పది మంది స్నేహితులకి ఆ కార్యక్రమం చేపట్టమని ఛాలెంజ్ విసురుతాము.

ఇది వైరల్ అయ్యి అవకాశం వున్న ఇంటర్ పై చదువుతున్న విద్యార్ధులూ, యువత అందరూ ఏడాదికి ఓ రోజున తమ సమీపంలో పొలంలో గానీ స్వగ్రామంలో గానీ రైతులని సందర్శించి వారి కృషికి ధన్యవాదములు తెలిపి వారితో ఓ రోజు పొలంలో గడిపే అలవాటు ఏర్పడుతుంది.

సామాన్య ప్రజలు తమతమ కుటుంబాలతో ఏడాదికి జూలై ఆజస్టుల నెలలోని ఓ వారాతంలో సమీప గ్రామం సందర్శించి రైతు చేస్తున్న కృషిని గుర్తించి వారికి ధన్యవాదములు తెలిపే కార్యక్రమం చేపట్టి చిన్నారులకి రైతులు ఎంత కష్టపడితే పిజ్జాలూ బర్గర్లూ లేస్ చిప్స్ వంటివి అందుతున్నాయో ప్రత్యక్షంగా చూపించి రైతు ప్రాముఖ్యతనీ ఆయనని గౌరవించాలనే భావనని వారిలో పెంపొందుతుంది.

తెలుగు ప్రజలందరూ ఈ దిశగా పదేసి మందిని ట్యాగ్ చేస్తూ కార్యక్రమాలు చేపడితే ఈ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఓ స్వచ్చ భారత్ ఉద్యమంలా వ్యాప్తి చెందుతుంది.

సినీ టీవీ రంగ ప్రముఖులు ఆచరిస్తే ఇది సులభంగా వ్యాప్తి చెందుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All