
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ హత్య బాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడని, దీనికి బాలీవుడ్ మాఫియా కూడా ఓ కారణమని నెటిజన్స్, బాలీవుడ్ లోని ఓ వర్గం ఘాటుగా విమర్శలు చేస్తున్న వియం తెలిసిందే. ఈ నేపథ్యంలోబాలీవుడ్ మాఫియా తరహాలోనే త్రిష కోలీవుడ్ మాఫియాలో ఓ భాగమని వివాదాస్పద నటి మీరా మిథున్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
శ్రీరెడ్డి టాలీవుడ్‌లో క్రేజీ స్టార్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయిన విషయం తెలిసిందే. అదే పంథాను అనుసరిస్తున్న కోలీవుడ్‌లో మీరా మిథున్ పాపులర్ గా మారింది. రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన మీరా మిథున్ తాజాగా త్రిషపై చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి.
త్రిష తన డ్రిస్సింగ్ స్టైల్‌ని కాపీ కొడుతోందని, 5 ఫీట్ల 5 ఇంచుల హైట్ వుండే త్రిష సైడ్ యాక్టర్ అని, అలాంటి ఆమెకు మెయిన్ హీరోయిన్ పాత్రలు ఎలా దక్కాయో అర్థం కావడం లేదని, నా నుంచి పోటీని తట్టుకోలేకే త్రిష కోలీవుడ్ మాఫియా గ్యాంగ్‌తో చేరిపోయిందని ఆ కారణంగానే త్రిష నటించిన `ఎన్నైల్ అరిందాల్` చిత్రంలో తాను నటించిన సన్నివేశాల్ని తొలిగించారని` మీరా మిథున్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.