
మలయాళంలో దృశ్యం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ చిత్రం వివిధ భాషల్లోకి తెరకెక్కి అంతే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా మలయాళంలో వచ్చిన దృశ్యం 2 కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోకి కూడా రీమేక్ అయింది. వెంకటేష్ హీరోగా మీనా ఈ సీక్వెల్ లో కూడా నటించారు. షూటింగ్ జెట్ స్పీడ్ లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే తమిళ రీమేక్ విషయానికి వచ్చేసరికే చిన్న ఇబ్బంది వచ్చింది. దృశ్యం చిత్రాన్ని తమిళ్ లో పాపనాశం పేరుతో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించారు. అప్పుడు వారు రిలేషన్ లో ఉన్నారు. రెండేళ్ల కిందట ఇద్దరూ విడిపోయారు. ఒకరికొకరు ఎదురుపడడానికి కూడా ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
అందుకోసమే గౌతమి స్థానంలో మీనాను తీసుకోవాలని భావిస్తున్నారు. మీనా మలయాళం, తెలుగులో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు తమిళ్ లో చేస్తుందా అన్నది చూడాలి.