Homeరివ్యూస్ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయ్ ) రివ్యూ

ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయ్ ) రివ్యూ

నటీనటులు : నాని , సాయి పల్లవి , భూమిక తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం :  శ్రీవేణురామ్
రేటింగ్ : 2. 75/ 5
రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2017
వరుస విజయాలు అందుకుంటున్న నాని ఫిదా భామ సాయి పల్లవి తో కలిసి నటించిన చిత్రం ” ఎం సి ఏ ” మిడిల్ క్లాస్ అబ్బాయ్ . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ చిత్రంతో నాని మరో విజయం అందుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .
కథ :
పనిపాట లేని నాని (నాని ) కి అన్నయ్య ( రాజీవ్ కనకాల ) అంటే విపరీతమైన అభిమానం అంతకంటే ఎక్కువే తమ్ముడంటే అన్నయ్యకు కానీ అన్నయ్య జ్యోతి ( భూమిక ) ని పెళ్లి చేసుకోవడంతో అన్నాదమ్ముల మధ్య దూరం పెరుగుతుంది దాంతో వదిన అంటే విపరీతమైన కోపం నాని కి . అయితే ఆర్టీవో గా పనిచేసే జ్యోతి కి వరంగల్ ట్రాన్స్ ఫర్ అవుతుంది దాంతో ఆమె వెంట వరంగల్ కు నాని వెళ్లాల్సి వస్తుంది . అక్కడ  పల్లవి ( సాయి పల్లవి ) ని ప్రేమిస్తాడు ఈ విషయం వదిన కు తెలియడం  నాని కి పల్లవి దూరం కావడంతో వదిన మీద నాని కి మరింత కోపం వస్తుంది . కట్ చేస్తే వరంగల్ రౌడీ శివ నుండి వదిన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది దాంతో వదిన కోసం నాని ఏం చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
నాని
భూమిక
ఇంటర్వెల్
క్లైమాక్స్
డ్రా బ్యాక్స్ :
సంగీతం
సెకండాఫ్
నటీనటుల ప్రతిభ :
మిడిల్ క్లాస్ అబ్బాయ్ పాత్రలో నాని మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు . అసలే న్యాచురల్ స్టార్ ఆపై మిడిల్ క్లాస్ అబ్బాయ్ దాంతో ఆ పాత్రకి పరిపూర్ణ న్యాయం చేసాడు నాని . నటుడిగా మరో మెట్టు ఎక్కాడు నాని ఈ చిత్రంతో . వదినతో అసూయపడే సన్నివేశాల్లో అలాగే సాయి పల్లవితో రొమాన్స్ చేసే సీన్స్ లో మరింతగా రాణించాడు . సాయి పల్లవి కి పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది . ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మాజీ హీరోయిన్ భూమిక కు మంచి పాత్రే లభించింది .విలన్ పాత్రలో కొత్తవాడు అయినప్పటికీ బాగానే చేసాడు విజయ్ . ఇక మిగిలిన పాత్రల్లో రాజీవ్ కనకాల , ఆమని , నరేష్ , ప్రియదర్శి తమతమ పాత్రల పరిధిమేరకు నటించారు .
సాంకేతిక వర్గం :
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది , ఇక రీ రికార్డింగ్ అయితే కుదరలేదు అసలు చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ స్థాయికి తగ్గ సంగీతం కాదనే చెప్పాలి . నిర్మాణ విలువలు ఫరవాలేదు , ఛాయాగ్రహణం బాగుంది …… ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ విషయానికి వస్తే ….. దర్శకుడి గా వేణు శ్రీరామ్ కు ఇది రెండో సినిమా దాంతో కొంత జాగ్రత్త పడ్డాడు కానీ ఫస్టాఫ్ ని ఎంటర్ టైనర్ గా మలిచి సెకండాఫ్ కు వచ్చేసరికి తేలిపోయాడు .
ఓవరాల్ గా :
మిడిల్ క్లాస్ అబ్బాయ్…..  మిడిల్ డ్రాప్
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All