Thursday, November 24, 2022
Homeగాసిప్స్ప్రతిరోజూ పండగే సినిమా లైన్ ను చెప్పేసిన మారుతి

ప్రతిరోజూ పండగే సినిమా లైన్ ను చెప్పేసిన మారుతి

ప్రతిరోజూ పండగే సినిమా లైన్ ను చెప్పేసిన మారుతి
ప్రతిరోజూ పండగే సినిమా లైన్ ను చెప్పేసిన మారుతి

దర్శకుడు మారుతి ఇండస్ట్రీలోకి రావడమే ఒక సంచలనం. చాలా తక్కువ బడ్జెట్ తో యూత్ కు నచ్చే అంశాలతో ఈ రోజుల్లో అనే సినిమా తీసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే తన రెండో చిత్రంగా బస్ స్టాప్ అనే సినిమాతో డోస్ ను మరింత పెంచాడు. ఆ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. దాని తర్వాత కొంత A రేటెడ్ కంటెంట్ ఉన్న సినిమాలతో అసోసియేట్ అయ్యాడు. దానివల్ల మారుతికి బూతు చిత్రాల దర్శకుడు అన్న పేరు వచ్చేసింది. మొదటి రెండు చిత్రాలు తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలని, తాను అసోసియేట్ అయిన సినిమాలకు క్రియేటివ్ సైడ్ తనకు ప్రమేయం లేదని, తనను ఆ కోణంలో చూడవద్దని ఎన్ని సార్లు చెప్పినా ఆ పేరు మాత్రం పోలేదు. అయితే నేను కూడా క్లీన్ ఎంటర్టైనర్ ఇవ్వగలను అంటూ నానితో భలే భలే మగాడివోయ్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాలో ఒక్క బూతు మాట కూడా లేకుండా తీసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ నేపథ్యంలో మారుతిని చూసే దృష్టి కూడా మారుతూ వచ్చింది. ఆ తర్వాత మహానుభావుడు సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో మారుతికి పెద్ద బ్యానర్ల నుండి, పెద్ద హీరోల నుండి అవకాశాలు రావడం మొదలయ్యాయి. వెంకటేష్ తో బాబు బంగారం, నాగ చైతన్యతో శైలజరెడ్డి అల్లుడు సినిమాలు చేసినా అవి అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న ప్రతిరోజూ పండగే విడుదలకు ముస్తాబవుతోంది.

- Advertisement -

డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రాశి ఖన్నా హీరోయిన్, సత్యరాజ్ కీలక పాత్ర చేసాడు. ప్రతిరోజూ పండగే విషయంలో రకరకాల కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పటిదాకా వచ్చిన పాటలు, ప్రోమోను బేస్ చేసుకుని ఎవరికి వారు కథలు అల్లడం మొదలుపెట్టారు. విదేశాల్లో చదువుకునే ఒక కొడుకు, ఇండియా వచ్చి తాతను, తండ్రిని కలిపే ప్రయత్నమే ప్రతిరోజూ పండగే అని ఒక కథ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని మారుతి నిర్ణయించుకున్నాడు.

సోషల్ మీడియాలో దీని గురించి స్పందిస్తూ ప్రతిరోజూ పండగే విషయంలో ప్రచారంలో ఉన్న ఏ ఒక్క కథ కూడా కరెక్ట్ కాదని, అన్నీ ఫేక్ అని మారుతి సెలవిచ్చాడు. ఇక కథ విషయానికి వస్తే.. ఒక మనిషి పుట్టినప్పుడు ఎలా అయితే సెలెబ్రేట్ చేసుకుంటున్నామో, ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా అలాగే సెలెబ్రేట్ చేసుకుని సెండాఫ్ ఇవ్వాలనే సరికొత్త పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కిందని, ప్రతి ఫ్రేమ్ ఆహ్లాదంగా ఉంటుందని, కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని మారుతి తెలిపాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts