Homeటాప్ స్టోరీస్హాలీవుడ్ టెక్నీషియ‌న్‌ని మెప్పించింది!

హాలీవుడ్ టెక్నీషియ‌న్‌ని మెప్పించింది!

హాలీవుడ్ టెక్నీషియ‌న్‌ని మెప్పించింది!
హాలీవుడ్ టెక్నీషియ‌న్‌ని మెప్పించింది!

టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ మారుతి 2019 ఎండింగ్‌లో `ప్ర‌తీరోజు పండ‌గే` అంటూ సాయిధ‌ర‌మ్‌తేజ్‌కి సూప‌ర్‌హిట్‌ని అందించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో మెగామేన‌ల్లుడి కెరీర్‌ని స్పీడ‌ప్ చేసిన ఆయ‌న ప్ర‌స్తుతం మ‌రో స్టార్ తో మ‌రో విభిన్న‌మైన చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

హీరో ఎవ‌రు? ఎలాంటి క‌థ‌తో మారుతి త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా వుంటే ఆయ‌న ముద్దుల కుమార్తె హియాకు అరుదైన ప్ర‌శంస ల‌భించింది. హియా ప్ర‌తిభ‌కు మెచ్చి హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ్యాన్ లాస్సేన్ (`జాన్ విక్‌` ఫేమ్‌) ప్ర‌శంస‌లు పొంద‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

మారుతి కుమార్తె  హియా సోష‌ల్ మీడియాలో హియా ఫొటోగ్ర‌ఫీ పేరిట  తాను తీసిన వివిధ ఫొటోల‌ని షేర్ చేస్టోంది. తాజాగా హియా షేర్ చేసిన కొన్ని ఫొటోల‌కు హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ్యాన్ లాస్సేన్ లైక్ చేసి హియాను ప్ర‌త్యేకంగా అభినందించార‌ట‌. డ్యాన్ లాస్సేన్ జాన్ విక్ 2, ది షేప్ ఆఫ్ వాట‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు ఫొటోగ్ర‌ఫీని అందించారు. హియా మారుతి రూపొందించిన `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంలో హీరోయిన్ రాశిఖ‌న్నాకు చెల్లెలిగా న‌టించి ఆక‌ట్టుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All