
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి తన కెరియర్ మొదట్లో ఈరోజుల్లో, బస్టాప్ అనే రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు చేశాడు. ఆ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు మారుతి మీద నెగటివ్ ఓపినియన్ ఏర్పరచుకున్నారు. అయితే మారుతి తన పంథా మార్చుకుని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ తర్వాత మారుతి పూర్తిగా మారిపోయాడు.
అయితే మారుతి ప్రస్తుతం 3 రోజెస్ అనే వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఆ వెబ్ సీరీస్ పోస్టర్ చూస్తుంటే మారుతి మళ్లీ తన పాత పద్ధతిని ఫాలో అయ్యాడని అనిపిస్తుంది. అసలే వెబ్ సీరీస్ అంటే అడల్ట్ కంటెంట్ తో ఉంటాయన్న టాక్ ఉంది. మరి మారుతి ఈ 3 రోజెస్ ఎలా తీశాడు అన్నది తెలియాల్సి ఉంది. ఆహా ఓటీటీలో రాబోతున్న ఈ 3 రోజెస్ సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే మారుతి డైరక్షన్ లో ప్రస్తుతం రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయ్ రిలీజ్ కు రెడీగా ఉంది. గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. మొత్తానికి మారుతి ఇటు సినిమాలు అటు వెబ్ సీరీస్ లతో హంగామా చేస్తున్నాడు.