Homeటాప్ స్టోరీస్మరో ప్రస్థానం రివ్యూ

మరో ప్రస్థానం రివ్యూ

మరో ప్రస్థానం రివ్యూ
మరో ప్రస్థానం రివ్యూ

యంగ్ హీరో తనీష్, ముస్కాన్ సేథీ, వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ మూవీ మరో ప్రస్థానం. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ జాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్, డైనమిక్ డైరెక్టర్ వినాయక్.. ఇలా సినీ ప్రముఖులు ఈ మూవీ ట్రైలర్ ను మెచ్చుకోవడంతో మరో ప్రస్థానం సినిమా పై ఆడియన్స్ లో క్యూరియాసిటి ఏర్పడింది. ఈరోజు మరో ప్రస్థానం రిలీజైంది. మరి.. మరో ప్రస్థానం ఫలితం ఏంటి..? తనీష్ కి విజయాన్ని అందించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే.. ముందుగా కథ చెప్పాలి.

కథ:
శివ (తనీష్‌), నైని (అర్చనా ఖన్నా) ఒకరినొకరు ప్రేమించుకుంటారు… పెళ్లి చేసుకుంటారు. అందమైన జీవితాన్ని మరింత అందంగా.. కలర్ ఫుల్ గా డిజైన్ చేసుకుంటాడు. గోవాలో ఓ ఇల్లు..నైని, తను ఎంతగానో అభిమానించే బెస్ట్ ఫ్రెండ్ ఉద్దవ్ (గగన్ విహారి)తో ఉండాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే.. శివ ఓ క్రిమినల్. ముంబాయిలో ఓ క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడుగా ఉంటూ క్రైమ్ చేస్తుంటాడు. ఈ గ్యాంగ్ కి లీడర్ రాణెభాయ్ (కబీర్ దుహాన్ సింగ్). పిల్లల్ని కిడ్నాప్ చేయడం.. బాంబ్ బ్లాస్టులు చేయడం.. అమ్మాయిలను రేప్ చేయడం.. ఇంకా చెప్పాలంటే.. ఈ గ్యాంగ్ చేయని నేరం లేదు. అయితే.. శివని ఎంతగానో నమ్మిన నైనా అసలు శివ చేసే జాబ్ ఏంటో కూడా అడగదు. అతని పై ఆమె చూపించే ప్రేమ.. నమ్మకంతో.. శివ ఆలోచపలో పడతాడు.

- Advertisement -

క్రైమ్ లైఫ్ కి గుడ్ చెప్పాలి అనుకుంటాడు. న్యూ లైఫ్ గోవాలో స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. అయితే.. తన గ్యాంగ్ గురించి బయట ప్రపంచానికి చెప్పాలి అనుకుంటాడు. ఆ గ్యాంగ్ చేసే క్రైమ్ ఆపాలని… సీక్రెట్ కెమెరాతో షూట్ చేస్తుంటాడు. అలాగే హైదరాబాద్ లో ప్లాన్ చేసిన బాంబ్ బ్లాస్ట్ ఆపాలి అనుకుంటాడు. రాణిభాయ్ తన గ్యాంగ్ లో ఎవరో ఓ వ్యక్తి సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారనే విషయం తెలుసుకుంటాడు కానీ.. అది ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేకపోతాడు. ఆ బాధ్యతను శివకే అప్పగిస్తాడు. మరో వైపు జర్నలిస్ట్ (భానుశ్రీ మెహ్రా) ఈ గ్యాంగ్ గురించి ఓ రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఈ విషయం తెలుసుకుని ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆమెను అక్కడ నుంచి శివ తప్పించాలి అనుకుంటాడు. ఇదిలా ఉంటే.. ఈ గ్యాంగ్ లో ఉండే యువిథ (ముస్తాన్ సేథి) శివను ప్రేమిస్తున్నాను అంటూ వెంటబడుతుంది. శివ మాత్రం ఆమె ప్రేమను తిరస్కరిస్తుంటాడు.

శివ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడని ఉద్దేవ్ కూడా ఈ గ్యాంగ్ లోనే ఉంటాడు. శివ సీక్రెట్ ఆపరేషన్ గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. శివ ఆ జర్నలిస్ట్ ను తప్పించాడా..? ఇంతకీ ఉద్దవ్, శివకి సపోర్ట్ చేశాడా..? లేదా..? ఆ గ్యాంగ్ ప్లాన్ చేసిన బాంబ్ బ్లాస్ట్ ని శివ ఆపగలిగాడా..? యువిథ ప్రేమను శివ అంగీకరించాడా..? సీక్రెట్ ఆపరేషన్ చివరకు ఏమైంది అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:
తనీష్‌
యాక్షన్
డైరెక్టర్ జానీ టేకింగ్
కథ, కథనం
సంగీతం

మైనస్ పాయింట్:
యాక్షన్ ఎక్కువుగా ఉండడం

విశ్లేషణ:
ఈ యాక్షన్ ఇంటెన్స్ మూవీలో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో తనీష్‌ గురించి. యాక్షన్, ఎమోషన్ రెండింటికి పూర్తి న్యాయం చేశాడు. ఏ సినిమాలో అయినా.. తెర పై పాత్ర బాధపడుతుంటే.. ఆ బాధను ప్రేక్షకుడు కూడా ఫీలైతే.. ఆ సినిమా సక్సస్ అయినట్టే. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. శివ పాత్రలో తనీష్ నటన చూస్తుంటే.. అయ్యో ఏమైంది అతనికి అనిపిస్తుంది. అతని బాధ.. తన బాధగా, అతని టెన్షన్ తన టెన్షన్ గా ప్రేక్షకుడు ఫీలవుతాడు. అంతలా సినిమాని కనెక్ట్ అయ్యేలా నటించారు హీరో తనీష్.

హీరోయిన్స్ అర్చనా ఖన్నా, ముస్కాన్ సేథీ, భానుశ్రీ మెహ్రీ.. ఈ ముగ్గురు పాత్రల పరిథిమేరకు నటించారు. అర్చనా ఖన్నాతో తనీష్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ యాక్షన్ మూవీలో హర్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీని చూపించడం బాగుంది. దర్శకుడు ఈకథను ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లేతో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేలా తెరకెక్కించడంలో సక్సస్ అయ్యారు. ఇలాంటి యాక్షన్ మూవీస్ లో ఫస్టాఫ్ గ్రిప్పింగ్ గా ఉన్నా.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఆ పట్టు తగ్గుతుంది కానీ.. ఈ సినిమా విషయంలో ఎక్కడా పట్టుతగ్గకుండా వాట్ నెక్ట్స్ అని చూసేలా ఉండడం ఈ సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. సునీల్ కశ్యప్ సంగీతం, వసంత కిరణ్,సంభాషణలు, ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగున్నాయి. రెగ్యులర్ చిత్రాలు కాకుండా ఓ కొత్త తరహా సినిమా చూడాలి అనుకునే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్తదనం ఎక్కడ ఉన్న ఆదరించే మన ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు అనడంలో సందేహం లేదు.

రేటింగ్: 3/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All