Homeటాప్ స్టోరీస్ఆదిపురుష్ లో హనుమాన్ రోల్ కోసం మరాఠీ నటుడు?

ఆదిపురుష్ లో హనుమాన్ రోల్ కోసం మరాఠీ నటుడు?

ఆదిపురుష్ లో హనుమాన్ రోల్ కోసం మరాఠీ నటుడు?
ఆదిపురుష్ లో హనుమాన్ రోల్ కోసం మరాఠీ నటుడు?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఆది పురుష్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇక ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ, బ్లూ మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించి షూట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడు. అలాగే కృతి సనన్ సీత పాత్ర పోషిస్తుందని ఇప్పటికే అధికారికంగా ధృవీకరించబడింది.

బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ఈ చిత్రంలో లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తుండగా టి సిరీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం మరాఠీ నటుడు దేవదత్త నాగ్ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రకు ఎంపికయ్యాడు. రాముడి కథ అనగానే హనుమంతుడి పాత్ర చాలా కీలకమవుతుంది. అందుకే దేవదత్తాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నటుడు షూటింగ్ లో పాల్గొంటాడు. అన్ని పాత్రలకు వివిధ ఇండస్ట్రీల నుండి ప్రముఖులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All