Homeటాప్ స్టోరీస్మణికర్ణిక రివ్యూ

మణికర్ణిక రివ్యూ

manikarnika movie review
మణికర్ణిక రివ్యూ

మణికర్ణిక రివ్యూ :
నటీనటులు : కంగనా రనౌత్ , అతుల్ కులకర్ణి
సంగీతం : శంకర్ ఇషాన్ లాయ్
నిర్మాతలు :కమల్ జైన్ ,నిశాంత్ పిట్టి , జి స్టూడియోస్
దర్శకత్వం : క్రిష్ , కంగనా రనౌత్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ” మణికర్ణికది క్వీన్ ఆఫ్ ఝాన్సీ . క్రిష్ , కంగనా రనౌత్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

మణికర్ణిక ( కంగనా రనౌత్ ) ని ఝాన్సీ రాజు గంగాధర్ రావు ( జిష్ణు సేన్ గుప్తా ) పెళ్లి చేసుకుంటాడు . మణికర్ణికకు పెళ్లి కావడంతో ఆమె పేరుని లక్ష్మీభాయి గా మారుస్తారు . అయితే భర్త మరణంతో లక్ష్మీబాయి రాజ్యాధికారాన్ని చేపట్టాల్సి వస్తుంది . అదేసమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన రాజ్య కాంక్ష కోసం లక్ష్మీబాయి ని టార్గెట్ చేస్తుంది . ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటీష్ వాళ్ళని ఎలా ఎదుర్కొంది ? ఆ సమయంలో ఆమె ఎంచుకున్న పోరాట పంథా ఎలాంటి మలుపులకు కారణం అయ్యింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కంగనా రనౌత్ నటన
విజువల్స్
యుద్ధ సన్నివేశాలు

డ్రా బ్యాక్స్ :

సంగీతం
ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

మణికర్ణికగా ఝాన్సీ రాణి లక్ష్మీభాయిగా అద్భుతమైన నటనని ప్రదర్శించి విమర్శకులను సైతం మెప్పించింది కంగనా రనౌత్ . ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో అసలు సిసలైన ఝాన్సీ రాణి ని తలపించింది కంగనా రనౌత్ . ఓవరాల్ గా కంగనా రనౌత్ నటవిశ్వరూపం చూపించింది ఈ చిత్రంలో . ఇక మిగిలిన పాత్రల్లో అతుల్ కులకర్ణి , జిష్ణు సేన్ గుప్తా , డానీ డొంజెప్ప , అంకితా లోకండే , రిచర్డ్ కీప్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

ఈ సినిమాకు కథకుడు విజయేంద్ర ప్రసాద్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే స్క్రీన్ ప్లే పరంగా రాణించలేకపోయాడు విజయేంద్ర ప్రసాద్ . ఇక దర్శకుడు విషయానికి వస్తే తెలుగువాడు క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు కానీ బ్యాలెన్స్ గా ఉన్న మిగతా సినిమాని కంప్లీట్ చేసింది కంగనా రనౌత్ దాంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మేకింగ్ పై పడింది దాంతో సరైన ఔట్ పుట్ ఇవ్వలేకపోయారు .నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేదు , విజువల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి . అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు .

ఓవరాల్ గా :

దేశ భక్తిని , వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట చరిత్ర ని తెలియజెప్పే ఈ చిత్రాన్ని తప్పకుండా ఓసారి చూడొచ్చు .

English Title: manikarnika movie review

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All