మంచు విష్ణు వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు అలాగే దర్శకుడు శ్రీను వైట్ల కూడా వరుస ప్లాప్ లతో కెరీర్ లేకుండా పోయింది . కట్ చేస్తే ఈ ఇద్దరు హిట్ కోసం కలుస్తున్నారు సినిమా చేస్తున్నారు . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ఢీ అనే సినిమా వచ్చింది . ఆ సినిమా రిలీజ్ కోసం కష్టాలు పడి ఎలాగో అలా రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యింది . కట్ చేస్తే శ్రీను వైట్ల పెద్ద దర్శకుడు అయిపోయాడు ఆ సినిమాతో .
అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల – మంచు విష్ణు కలిసి సినిమా చేయలేదు . కానీ ఇన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఢీ సీక్వెల్ కోసం . ఇక ఈ సినిమాని మంచు విష్ణు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు . త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించనున్నారు . ఈ సినిమా తోనైనా మంచు విష్ణు – శ్రీను వైట్ల హిట్ కొడతారా ? లేదా చూడాలి .
English Title: Manchu vishnu with Srinu vaitla