Homeటాప్ స్టోరీస్మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు

మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు

మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు
మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెల్సిందే. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ప్రభావంతో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు.

దసరా పండగ రోజులు  కాబట్టి ఈరోజు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుని ఆఫీస్ ను ఛార్జ్ లోకి తీసుకున్నాడు. మంచు విష్ణు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. “మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించా. మీ అందరి ఆశీస్సులు కావాలి” అని ట్వీట్ చేసాడు. దాంతో పాటుగా మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడానికి అవసరమైన పేపర్స్ పై సంతకాలు చేస్తోన్న ఫోటోను షేర్ చేసాడు.

- Advertisement -

తనతో పాటు గెలిచిన తన టీమ్ కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికలలో మంచు విష్ణు చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసాడు. ‘మా’ బిల్డింగ్ కట్టి తీరుతానని అన్నాడు. ఇప్పటికే 3 స్థలాలు కూడా చూశానని వ్యాఖ్యానించాడు. వీటితో పాటు ఇతర ప్రామిస్ లను కూడా మంచు విష్ణు ఏమేరకు నిలబెట్టుకుంటాడు అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All