
డానియల్ శేఖర్ ఇప్పుడు ఈ పదం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. బాహుబలి చిత్రంతో భల్లాలదేవ గా రానాను ఎలా పిలుచుకున్నారో..ఇప్పుడు భీమ్లా నాయక్ ద్వారా రానాను డానియల్ శేఖర్ గా అంత పిలుస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీ లో రానా అద్భుతమైన నటన కనపరిచి అందర్నీ మరోసారి ఆకట్టుకున్నాడు. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది.
పవన్ కళ్యాణ్ కు దీటుగా రానా నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వాస్తవానికి ఈ రోల్ లో ముందుగా మంచు విష్ణు ను అనుకున్నారట. ఈ ఆఫర్ విష్ణు దాకా తీసుకెళ్లారట కానీ అదే సమయంలో మా ఎన్నికల బిజీలో ఉండటంతో మంచు విష్ణు కాదన్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఆఫర్ రానా చేతికి చిక్కిందనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా డానియల్ శేఖర్ పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఇప్పుడు ఆ క్యారెక్టర్‌లో రానాను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోవడం కష్టమే.. కానీ మంచు విష్ణుకి మాత్రం ఓ మంచి ఆఫర్ మిస్సయిందనే అంత చెప్పుకుంటున్నారు.