Homeటాప్ స్టోరీస్బాహుబలి రైటర్ ని నమ్ముకున్న మంచు విష్ణు

బాహుబలి రైటర్ ని నమ్ముకున్న మంచు విష్ణు

ఎస్ ఎస్ రాజమౌళి చిత్రాలకు కథలను అందిస్తూ సంచలన విజయాలను అందుకుంటున్నాడు రచయిత విజయేంద్ర ప్రసాద్ , అలాగే బాలీవుడ్ లో కూడా కథలను ఇచ్చి సక్సెస్ అయ్యాడు విజయేంద్ర ప్రసాద్ దాంతో అతడి కథలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . విజయేంద్ర ప్రసాద్ కథ ఇస్తే సూపర్ హిట్ కొట్టినట్లే అని భావిస్తున్న మంచు విష్ణు అతడ్ని ఒప్పించి తన కు ఒక కథ రాయమని కోరడంతో ఎట్టకేలకు ఓ కథ రెడీ చేసాడట విజయేంద్ర ప్రసాద్ . ఇంకేముంది ఆ కథ ని స్క్రీన్ పై చక్కగా ప్రెజెంట్ చేసే డైరెక్టర్ ఎవరా ? ఆతృతగా ఎదురు చూస్తున్నాడట మంచు విష్ణు .

మంచు విష్ణు హీరోగా మూడు , నాలుగు విజయాలను అందుకున్నాడు కానీ హీరోగా అనుకున్న రేంజ్ లో ఎగదలేదు దాంతో విజయేంద్ర ప్రసాద్ కథ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . అయితే విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథ లు కొన్ని డిజాస్టర్ లు అయినవి కూడా ఉన్నాయి మరి . మంచు విష్ణు కు హిట్ వస్తుందో లేక డిజాస్టర్ వస్తుందో చూడాలి . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All