Homeటాప్ స్టోరీస్మంచు విష్ణు ప్యానెల్ మెంబర్స్ విడుదల

మంచు విష్ణు ప్యానెల్ మెంబర్స్ విడుదల

మంచు విష్ణు ప్యానెల్ మెంబర్స్ విడుదల
మంచు విష్ణు ప్యానెల్ మెంబర్స్ విడుదల

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎప్పటినుండో ఎన్నో వివాదాలు, వాదోపవాదాలతో నలుగుతోన్న మా వ్యవహారం మొత్తానికి ముందుకు కదిలింది. మా ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించనున్నారు. మొత్తం 900 మంది ఉన్న మా ఎలక్షన్స్ గత కొన్నేళ్లుగా మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.

ఈసారి మా ప్రెసిడెంట్ బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించగా ఇప్పుడు మంచు విష్ణు వంతు వచ్చింది. మంచు విష్ణు ప్యానెల్ లో రఘుబాబు (జనరల్ సెక్రటరీ), బాబు మోహన్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), మాదాల రవి (వైస్ ప్రెసిడెంట్), ప్రిథ్వీరాజ్ బాలిరెడ్డి (వైస్ ప్రెసిడెంట్), శివబాలాజీ (ట్రెజరర్), కరాటే కళ్యాణి (జాయింట్ సెక్రటరీ), గౌతమ్ రాజు (జాయింట్ సెక్రటరీ)లు ఉన్నారు.

- Advertisement -

ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా కూడా కొంత మంది పేరున్న వ్యక్తులు ఉన్నారు. అర్చన (వేద), అశోక్ కుమార్, గీతా సింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి పోటీ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All