
పోర్న్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా సన్నీ లియోన్..ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి పోర్న్ చిత్రాలకు దూరమైంది. బాలీవుడ్ తో పాటు తెలుగు లోను పలు సినిమాలు చేసిన సన్నీ..ప్రస్తుతం వరుస సినిమాలతో ..కుటుంబ బాధ్యతలతో గడుపుతుంది. తాజాగా ఈమె తెలుగు లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న గాలి నాగేశ్వరావు మూవీ లో నటిస్తుంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ క్రమంలో మంచు విష్ణు – సన్నీ మధ్య జరిగిన ఓ ఫన్నీ సంఘటనను సోషల్ మీడియా లో సన్నీ షేర్ చేసింది.
ఈ వీడియో లో సన్నీ గోడచాటున దాక్కొని ఉండగా.. మంచు విష్ణు నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో ఫేస్‌కు ఓ మాస్క్ ధరించి అతడ్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అయితే మంచు విష్ణు ఆమెను అలా చూసి ఏ మాత్రం భయ పడడు. ఆ తర్వాత మాస్క్ తీయగానే.. భయంతో వణికిపోయి పరుగులు తీస్తాడు. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ.. నా ప్రయత్నం మరోసారి విఫలం అయ్యింది అని కామెంట్ చేసింది సన్నీ లియోన్. నెట్టింట ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మోసగాళ్లు సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విష్ణు ఇప్పుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో గాలి నాగేశ్వరావు పాత్రలో విష్ణు కనిపించనుండగా.. విష్ణు క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే సన్నీ స్కెచ్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో సన్నీ రేణుక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
— Allu Arjun (@alluarjun) April 8, 2022