Sunday, December 4, 2022
Homeటాప్ స్టోరీస్మంచు మ‌నోజ్ షాకింగ్ స్లిమ్ లుక్!

మంచు మ‌నోజ్ షాకింగ్ స్లిమ్ లుక్!

మంచు మ‌నోజ్ షాకింగ్ స్లిమ్ లుక్!
మంచు మ‌నోజ్ షాకింగ్ స్లిమ్ లుక్!

మంచు మ‌నోజ్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు, మీడియాకు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల దృష్ట్యా కొంత నిరుత్సాహానికి గురైన ఆయ‌న సోష‌ల్ మీడియాతో పాటు మీడియాని, సినిమాల‌ని అవైడ్ చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డంతో రిలీఫ్ అయిన మంచు మ‌నోజ్ మ‌ళ్లీ సినిమాలపై దృష్టిపెట్టారు.

- Advertisement -

లాక్‌డౌన్ కి ముందు `అహం బ్ర‌హ్మ‌స్మి` చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయి చిత్రంగా ప్రారంభించారు. శ్రీ‌కాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మంచు మ‌నోజ్‌, నిర్మ‌లాదేవి నిర్మాత‌లు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే లాక్‌డౌన్ స‌మ‌యంలో భారీగా బ‌రువు పెరిగిన మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావ‌డంతో షాకింగ్ లుక్‌లోకి ట్రాన్స్ ఫార్మ అయిపోయారు.

క‌ఠిన ఆయుర్వేద నిబంధ‌న‌ల్ని పాటిస్తూ భారీ క‌స‌ర‌త్తులు చేస్తూ ఏకంగా 15 కిలోలు బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా స్టైలిష్ లుక్‌లోకి మారిపోయి షాకిస్తున్నారు. శుక్ర‌వారం త‌న తాజా లుక్‌కి సంబంధించిన ఫొటోల‌ని మంచు మ‌నోజ్ అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. `అహం బ్ర‌హ్మాస్మి` చిత్రంతో పాటు మంచు మ‌నోజ్ మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడితో ఓ మూవీ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts