
దేశంలో ఎక్కడ చూసినా అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరువాత నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. ఇటీవల షాద్‌నగర్ ఘటన తరువాత దిశ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయినా నో యూస్. ఎన్ని చట్టాలు చేసినా, కఠన నిబంధనలు అమల్లోకి వచ్చినా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అమాయకులైన అమ్మాయిల హత్యలూ ఆగడం లేదు.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసులే బాధితుల్ని బెధిరించి అత్యాచారానికి గురైన యువతిని అర్థ్రా రాత్రి దహనం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై ప్రజా స్వామ్య వాదులు. కళాకారులు, సెలబ్రిటీలు, సామాన్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సంఘనటపై యంగ్ హీరో మంచు మనోజ్ తనదైన స్టైల్లో మండి పడ్డారు.
`ఆడది అర్థ్రరాత్రి నిర్భయంగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని బాపూజీ అన్నారు. కానీ పట్టపగలే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఏడాదికోసారి గాంధీ జయంతి సెలవిచ్చి శుభాకాంక్షలు చెప్పుకోవడంలో అర్ం లేదు. మనకి బాపూ కరెన్సీ మీద ఓ డిజైన్ మాత్రమే. ఆ రోజు సెలవిచ్చి మందు దొరకకుండా చేసే ఒక శాపం. అంతేగా మారదాం బాస్ ప్లీజ్` అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ `అహం బ్రహ్మస్మి` చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.