Homeన్యూస్రెండో వివాహ వార్తలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన మనోజ్

రెండో వివాహ వార్తలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన మనోజ్

రెండో వివాహ వార్తలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన మనోజ్
రెండో వివాహ వార్తలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన మనోజ్

సెలబ్రిటీల జీవితాలపై ఎప్పుడూ మీడియా కన్ను ఉంటుంది. అలా అని వాళ్ళు రాసిందల్లా నిజం అయిపోతుందని కాదు. మీడియా వార్తలు రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి రాయడం బెటర్. లేకుంటే ఇలాగే అవుతుంది. మంచు మనోజ్ గురించి ఒక వెబ్ సైట్ ఒక కథనం అల్లింది. మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే గతేడాది తాము విడిపోయామని, విడాకులు తీసుకున్నట్లు మనోజ్ ప్రకటించాడు.

అప్పటినుండి మనోజ్ రెండో పెళ్లి గురించి రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఒక వెబ్ సైట్ రాసిన కథనం ప్రకారం మంచు మనోజ్ ఒక ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. కానీ మోహన్ బాబు తమ రిలేటివ్స్ లో ఒకరికి ఇచ్చి మనోజ్ పెళ్లి జరిపించాలని చూస్తున్నాడట. మరి వీరిలో ఎవరితో మనోజ్ పెళ్లి అంటూ కథనం రాయగా మనోజ్ ఫన్నీ వే లో రెస్పాండ్ అయ్యాడు.

- Advertisement -

“పెళ్ళికి నన్ను కూడా పిలవండి. పెళ్లి ఎక్కడ జరుగుతోంది అండ్ ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు? మీ ఇష్టంరా అంతా మీ ఇష్టం” అని బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఉన్న ఫోటోను షేర్ చేసాడు. తనపై వచ్చిన వార్తలకు ఇలా ఫన్నీగా రెస్పాండ్ అవ్వడంతో పాటు మనోజ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు అందరూ నవ్వుకున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All