Sunday, December 4, 2022
Homeటాప్ స్టోరీస్మంచు మ‌నోజ్ మ‌రో పెళ్లికి రెడీ!

మంచు మ‌నోజ్ మ‌రో పెళ్లికి రెడీ!

మంచు మ‌నోజ్ మ‌రో పెళ్లికి రెడీ!
మంచు మ‌నోజ్ మ‌రో పెళ్లికి రెడీ!

హీరో మంచు మ‌నోజ్ గ‌త కొంత కాలంగా మాన‌సింగా స్ట్ర‌గుల్ అవుతూ సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. త‌న భార్య‌కు గ‌త మూడేళ్లుగా దూరంగా వుంటున్న మ‌నోజ్ ఎట్ట‌కేల‌కు డైవ‌ర్స్ తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్‌ని వీడి తిరుప‌తికే ప‌రిమిత‌మ‌య్యారు. అక్క‌డ ప‌లు డెవ‌లాపింగ్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. శ్రీ‌విద్యానికేత‌న్ కు సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకున్నారు.

- Advertisement -

భార్య నుంచి విడాకులు తీసుకున్న త‌రువాత `అహం బ్ర‌హ్మ‌స్మి` చిత్రాన్ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే మ‌నోజ్ మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నార‌ని, ఒక‌రితో ల‌వ్‌లో వున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మూడేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టిన మ‌నోజ్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌నోజ్ ఇష్ట‌ప‌డుతున్న అమ్మాయి ఎవ‌రు? ఏంటీ? .. ఎక్క‌డ వుంటుంది? వంటి విష‌యాలు మాత్రం ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. కానీ ఆ అమ్మాయినే మ‌నోజ్ వివాహం చేసుకోబోతున్నార‌ని, ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే మ‌నోజ్ సోష‌ల్ మీడియా వేదిక వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts