
కమర్షియల్ ఫార్మాట్ లోనే ఎంతో కొంత కొత్తదనం చూపించే దర్శకుడు మారుతి. మిడ్ రేంజ్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో చిన్న చిత్రాలు కూడా చేస్తుంటాడు. మారుతి ప్రతిరోజూ పండగే వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తోన్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసాడు.
మంచు రోజులు వచ్చాయి విడుదలకు సిద్ధమైంది. ముందుగా దసరాకు విడుదల చేద్దామనుకున్నా కానీ ఇప్పుడు దీపావళికి విడుదల కాబోతోంది. నవంబర్ 4న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ వంతు.
ఈరోజు నుండి దసరా సందర్భంగా ప్రమోషన్స్ ను షురూ చేసారు. అలాగే రేపు అంటే అక్టోబర్ 14న ఉదయం 9 గంటలకు మంచి రోజులు వచ్చాయి ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. ఏక్ మినీ కథ చిత్రంతో పాపులర్ అయిన సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా చేయగా మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్, ఎస్కెఎన్ సంయుక్తంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. టీజర్ తో ఇది ఒక ఫన్ రైడ్ అన్న భావన కలిగింది. మరి ట్రైలర్ తో అంచనాలు పెరుగుతాయో లేదో చూద్దాం.