
మారుతి సినిమాలు అంటే కామెడీకి ఢోకా ఉండదు. భలే భలే మగాడివోయ్, ఈరోజుల్లో, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలతో ఆ మాటను నిరూపించుకున్నాడు మారుతి. ప్రతిరోజూ పండగే తర్వాత మారుతి నుండి వస్తోన్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఏక్ మినీ కథతో తనను తాను నిరూపించుకున్న సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ కథానాయికగా నటించిన చిత్రమిది.
నవంబర్ 4న దీపావళి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. దసరా సందర్భంగా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు. థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే కథ చూచాయిగా అర్ధమైపోతుంది. చాలా సింపుల్ లైన్ నే మారుతి ఎంచుకున్నట్లు అర్ధమవుతోంది. హీరో, హీరోయిన్ కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేయడం, అక్కడ ఒకరినొకరు చూసుకుని ఇంప్రెస్ కావడం, విచ్చలవిడిగా ప్రేమించేసుకోవడం, అది హీరోయిన్ తండ్రి కళ్ళల్లో పడడం, కట్ చేస్తే వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అన్నది ప్రధాన పాయింట్.
ట్రైలర్ అంతటా సింపుల్ హ్యూమర్ ఉండేలా చూసుకున్నాడు మారుతి. సిట్యుయేషనల్ కామెడీపై ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. మరి ప్రోమోలు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. యూవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.
Here’ is my next FUN-FILLED Theatrical Trailer of #ManchiRojulochaie ??
Watch here ?https://t.co/5LmwzV2z86@santoshshobhan @Mehreenpirzada @anuprubens @vcelluloidsoffl @SKNonline @UVConcepts_ @MassMovieMakers @adityamusic#MROfromNov4th pic.twitter.com/uFVV5T5fiD
— Director Maruthi (@DirectorMaruthi) October 14, 2021
