Homeన్యూస్మంచి రోజులు వచ్చాయి ప్రీమియర్స్ కు సూపర్బ్ బజ్

మంచి రోజులు వచ్చాయి ప్రీమియర్స్ కు సూపర్బ్ బజ్

మంచి రోజులు వచ్చాయి ప్రీమియర్స్ కు సూపర్బ్ బజ్
మంచి రోజులు వచ్చాయి ప్రీమియర్స్ కు సూపర్బ్ బజ్

సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి నుండి వస్తోన్న లిమిటెడ్ బడ్జెట్ చిత్రం మంచి రోజులు వచ్చాయ్. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే మంచి రోజులు వచ్చాయ్ చిత్రాన్ని ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేయనున్నారు. తమ ప్రోడక్ట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ ఉండటంతో టీమ్ ఒకరోజు ముందే పబ్లిక్ కు ప్రీమియర్ చేస్తున్నారు. ఈ ప్రీమియర్ కు మంచి బజ్ ఏర్పడింది. ఒక షో కొన్ని నిమిషాల్లోనే హౌజ్ ఫుల్ అవ్వడంతో టీమ్ దాన్ని మూడు షోస్ కు పెంచాలని డిసైడ్ అయ్యారు.

లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కడంతో మంచి రోజులు వచ్చాయ్ చిత్రానికి టార్గెట్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు. పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ చిత్రం ప్రాఫిట్స్ లోకి రావడం ఖాయం. అందుకే టీమ్ ప్రోడక్ట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ లు లీడ్ రోల్ లో నటించారు. ఎస్కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

- Advertisement -

ఈరోజు నైట్ కే మంచి రోజులు వచ్చాయ్ ఫేట్ తెలిసిపోతుంది. ఈ సినిమా రెండు తమిళ్ డబ్ చిత్రాలు పెద్దన్న, ఎనిమిలతో పోటీ పడుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All