Homeటాప్ స్టోరీస్అఖిల్ ఏజెంట్ లో మలయాళ లెజండ్

అఖిల్ ఏజెంట్ లో మలయాళ లెజండ్

అఖిల్ ఏజెంట్ లో మలయాళ లెజండ్
అఖిల్ ఏజెంట్ లో మలయాళ లెజండ్

అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని పాట పాడుకుంటూ ఉండొచ్చు. తన డెబ్యూ జరిగిన ఐదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకున్నాడు అఖిల్. తన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ విజయం సాధించింది. తొలి వీకెండ్ తోనే ఈ చిత్రం దాదాపుగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది. ఇక ఈ వారం, సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ బట్టి సినిమా ఎంత విజయం సాధించింది అనేది క్లారిటీ వస్తుంది.

ఏదేమైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ద్వారా అఖిల్ తన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో తన ఐదవ చిత్రం ఏజెంట్ ను తిరిగి మొదలుపెట్టబోతున్నాడు. ఏజెంట్ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.

- Advertisement -

త్వరలోనే ఏజెంట్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతోంది. తాజా సమాచారం ప్రకారం మలయాళ లెజండరీ హీరో మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టార్ట్ అవ్వబోయే షెడ్యూల్ లో మమ్ముట్టి కూడా షూటింగ్ లో పాల్గొంటాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఏజెంట్ లో అఖిల్ అక్కినేని సీక్రెట్ ఆఫీసర్ రోల్ చేయబోతుండగా, మమ్ముట్టిది ఆర్మీ ఆఫీసర్ పాత్రట. సురేందర్ రెడ్డి ఈ స్టైలిష్ యాక్షన్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All