
అఖిల్ అక్కినేని తన డెబ్యూ జరిగిన ఐదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకున్నాడు. తన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గత సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ విజయం సాధించింది. తొలి వీకెండ్ తోనే ఈ చిత్రం దాదాపుగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో తన ఐదవ చిత్రం ఏజెంట్ ను పూర్తి చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఏజెంట్ లో అఖిల్ అక్కినేని సీక్రెట్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నాడు.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక రోల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ది డెవిల్’ అంటూ మమ్ముట్టిని ‘ఏజెంట్’ అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో మమ్ముట్టి పాల్గొనబోతున్నారు. ఈ మూవీ లో అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య నటిస్తుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రఘుల్ హెరియన్ ధరుమన్ కెమెరా మెన్ గా , జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.