Homeటాప్ స్టోరీస్'మళ్లీ రావా'కు అవార్డుల పంట..

‘మళ్లీ రావా’కు అవార్డుల పంట..

malli-raava-gets-good-awardsశ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్లీ రావా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి అవార్డుల పంట పండింది.

విలంభి నామ సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ అందించిన ఉగాది పురస్కారాలలో ‘మళ్లీ రావా’ చిత్రం బెస్ట్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. మొత్తం నాలుగు శాఖల్లో ‘మళ్లీ రావా’ చిత్రం అవార్డులను సొంతం చేసుకుంది. ఈ పురస్కారాలలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఈ చిత్రం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్, బెస్ట్ సపోర్ట్ యాక్టర్ మేల్ విభాగాలలో అవార్డులను గెలుచుకుంది.

- Advertisement -

బెస్ట్ డైరెక్టర్ గా గౌతమ్ తిన్ననూరి, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్, బెస్ట్ సపోర్ట్ యాక్టర్ మేల్ అప్పాజీ అంబరీష లు అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ మాట్లాడుతూ.. “మా బ్యానర్ లో వచ్చిన ‘మళ్లీ రావా’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ వారు మా సినిమాను గుర్తించి, అవార్డులతో సత్కరించినందుకు.. ముందుగా వారికి మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే అవార్డులు గెలుచుకున్న మా చిత్ర సభ్యులతో పాటు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. త్వరలో మరో మంచి మూవీ తో మీ ముందుకు వస్తాము..” అని అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All