Homeగాసిప్స్బూతులు తిట్టిన హీరోయిన్

బూతులు తిట్టిన హీరోయిన్

Malayala actress Manju savekar fires on hotel server
Manju savekar

హోటల్ లోని తన గది శుభ్రంగా లేకపోవడంతో హోటల్ సిబ్బందిపై ఆగ్రహించిన ఆ హీరోయిన్ ఏకంగా బూతుల పంచాంగం అందుకోవడంతో ఖిన్నుడైన హోటల్ సిబ్బంది ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన కేరళ లో జరిగింది . సంఘటన వివరాలలోకి వెళితే ……. ఓ సినిమా షూటింగ్ కోసం మంజు సవేకర్ అనే హీరోయిన్ కేరళలోని నాగర్ కోవిల్ పరిసర ప్రాంతానికి వెళ్ళింది . దాంతో నాగర్ కోవిల్ లోని ఓ హోటల్ లో మంజు సవేకర్ కు రూం బుక్ చేసారు చిత్ర యూనిట్ .

షూటింగ్ కి వెళ్లి మళ్ళీ హోటల్ కు చేరుకుంది హీరోయిన్ , అయితే ఆమె వచ్చే సరికి రూం శుభ్రంగా లేదని ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది . సర్వీస్ బాయ్ ని అలాగే మేనేజర్ ని బండ బూతులు తిట్టేసింది . హీరోయిన్ అయి ఉండి బూతులు తిట్టడంతో అవమానంగా భావించిన సర్వీస్ బాయ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు . దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు హీరోయిన్ కు సర్దిచెప్పి బాయ్ కి క్షమాపణ చెప్పించారు అలాగే బాయ్ చేత హీరోయిన్ కు క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది . అయితే తన చేత బాయ్ కి క్షమాపణ చెప్పిస్తారా ? అంటూ ఏడ్చుకుంటూ ఆ హోటల్ నుండి వెళ్ళిపోయింది హీరోయిన్ మంజు సవేకర్ .

- Advertisement -

English Title: Malayala actress Manju savekar fires on hotel server

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All